బ్రహ్మముడి అప్పుకి చామంతి సీరియల్ నటుడు ఆశిష్ తో ఎంగేజ్మెంట్
on Jul 16, 2025

బ్రహ్మముడి సీరియల్ లో అప్పు రోల్ లో చేసే నైనిష రాయ్ గురించి అందరికీ తెలుసు. టామ్ బాయ్ గెటప్ లో వస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు నైనిష రాయ్ మరో బుల్లితెర నటుడు ఆశిష్ చక్రవర్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ పిక్స్ ని నైనిష తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "ఎన్నో కష్టాలు ఫేస్ చేసాక ఫైనల్ గా మాకంటూ ఒక రోజు వచ్చింది. నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచినందుకు థ్యాంక్స్" అంటూ ఆశిష్ ని జీ తెలుగును టాగ్ చేసింది. ఈ విషయంతో నెటిజన్స్ బుల్లితెర వాళ్లంతా కూడా విషెస్ చెప్తున్నారు. ఆర్జే సూర్య కంగ్రాట్యులేషన్స్ నైనిష గారు అంటూ పోస్ట్ చేసాడు. "నీకోసమే చెక్కినట్టున్నాడు అబ్బాయి..మనసు కూడా అలాగే ఉంది.
లైఫ్ లాంగ్ ఇద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం..." అంటున్నారు. ఇక నైనిష ఇటు బ్రహ్మముడిలో అప్పు రోల్ లో, అలాగే వంటలక్క సీరియల్ లో ధారగా నటిస్తోంది. ఇక ఆశిష్ చక్రవర్తి విషయానికి వస్తే ఒక వైపు తమిళ్ సీరియల్స్ లో నటిస్తున్నాడు. అలాగే చామంతి అనే తెలుగు సీరియల్ లో నటిస్తున్నాడు. ఇక ఈయన గురించి చెప్పాలంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. 2017 లో మిష్టర్ ఇండియా చెన్నై, మిష్టర్ ఇండియా బెస్ట్ స్కిన్, 2018 లో మిష్టర్ మద్రాస్, 2019 లో మిష్టర్ చెన్నై ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని అందుకున్నాడు. ఐతే నిజంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా లేదంటే సీరియల్ కోసమా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



