Bigg Boss 9 Telugu Immanuel: టికెట్ టు ఫినాలే రేస్ నుండి సంజన అవుట్.. ఇమ్మాన్యుయేల్ టాప్!
on Dec 3, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం ఆరుగురు నామినేషన్లో ఉన్నారు. కెప్టెన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ మినహా అందరు నామినేషన్లో ఉన్నారు. ఇక అందరు ఎదురుచూస్తున్న 'టికెట్ టు ఫినాలే' మొదలైంది. ఇది ఎవరికి అయితే లభిస్తుందో వారు డైరెక్ట్ ఫినాలేకి వెళ్తారు. నిన్న మొదలైన ఈ 'టికెట్ టు ఫినాలే' లో ప్రతీ ఒక్కరికి ఛాన్స్ ఇస్తూ టాస్క్ లు ఇస్తానని బిగ్ బాస్ చెప్పాడు.
చదరంగం- రణరంగం అంటూ ఫిజికల్, బుద్ధిబలం ఉన్న టాస్కులు పెడుతున్నాడు బిగ్ బాస్. ముందుగా పెట్టిన టాస్కులో పవన్ కళ్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయేల్ పాల్గొన్నారు. అయితే ఈ టాస్కులో ఇమ్మాన్యుయేల్ గెలిచి మొదటి అడుగు వేశాడు. తన గడితో పాటు రెండు గడులని సొంతం చేసుకున్నాడు ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత మీరు ఎవరితో పోటీ పడాలని అనుకుంటున్నారో చెప్పండి అని ఇమ్మాన్యుయేల్ ని బిగ్ బాస్ అడుగగా సంజన పేరుని చెప్పాడు.
గార్డన్ ఏరియాలో ఇమ్మాన్యుయేల్, సంజన మధ్య ' పంతం నీదా నాదా' అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. సీసాకి ఉన్న తాడుని లాగి అవతలి వైపు ఉన్న బాక్స్ పైకి వచ్చేలా చేయాలి.. చుట్టూ ఉన్న బాల్స్‌ని తీసుకొని బాక్స్‌లోకి విసరాలి. ఇలా టాస్క్ ముగిసే సమయానికి ఎవరూ తమ అవతలి వైపు ఉన్న బాక్స్‌లో ఎక్కువ బాల్స్ ఉండేలా చూసుకుంటారో వారు ఈ టాస్కులో గెలుస్తారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్క్ మధ్యలో రోప్‌ని వదలడానికి వీల్లేదంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. ఇక ఇందులో చివరి వరకు సంజన టఫ్ ఫైట్ ఇచ్చింది కానీ చివర్లో తాడుని వదిలేసింది సంజన. దాంతో గేమ్ నుండి అవుట్ అయింది. ఇక తన గడిని ఇమ్మాన్యుయేల్ సొంతం చేసుకున్నాడు. టికెట్ టు ఫినాలే రేస్ నుండి సంజన అవుట్ అయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



