Brahmamudi : పాపకి పాలు పట్టిన కావ్య.. దుగ్గిరాల కుటుంబం హ్యాపీ!
on Jan 22, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -935 లో.....తులసి పాపని చూస్తూ మురిసిపోతుంది. ఒకసారి నాకు పాపని ఇవ్వమని ధర్మేంద్ర అంటాడు. నేను ఇవ్వను కావాలంటే నేను పడుకున్నాక మీరు చూసుకోండి అని తులసి అంటుంది. పాప తలకి నూనె పెట్టాలని లోపలికి తీసుకొని వెళ్తుంది. అప్పుడే మినిస్టర్ ధర్మేంద్ర దగ్గరికి రుద్రాణి వస్తుంది. మీ భార్య చాలా హ్యాపీగా ఉన్నట్లు ఉందని అంటుంది. అవును అంతా మీ వల్లే అని మినిస్టర్ అంటాడు.
ఇప్పుడు కావ్య తన దగ్గరున్న పాప తన కూతురు కాదని అంటుంది. అంటే ఇంట్లో వాళ్ళు కూడా తన మాట నమ్మి ఏదో ఒక ప్రయత్నం చేస్తారు కదా అని రుద్రాణి అంటుంది. అవును మనకి ఎలా తెలియాలని మినిస్టర్ అంటాడు. అక్కడ నా కూతురు ఉంది చెప్తుందని రుద్రాణి అంటుంది. మీరు ఇంత హెల్ప్ చేశారు. మీకు ఏం కావాలని మినిస్టర్ అడుగుతాడు ఏం అవసరమున్నా అడిగి తీసుకుంటానని రుద్రాణి అంటుంది. మరొకవైపు రాత్రి పాప ఏడుస్తుంది. అపర్ణ, ఇందిరాదేవి ఎంత ఎత్తుకున్నా పాప ఏడుపు అప్పట్లేదు.. ధాన్యాలక్ష్మి వచ్చి ఎత్తుకుంటుంది అయినా ఆపదు. దాంతో కావ్య వచ్చి పాపని తీసుకొని వెళ్లి పాలు పడుతుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పటికైనా కావ్య మనసు మారిందని అనుకుంటారు. ఆ మాటలు రేఖ విని రాహుల్ దగ్గరికి వెళ్లి ఆ కావ్యని బావకి దూరం చేసి నన్ను దగ్గర చేస్తానన్నారు.. ఏం చెయ్యట్లేదు.. ఇప్పుడు అందరు సంతోషంగా ఉన్నారని రేఖ అంటుంది. నువ్వు అనుకున్నట్లు నేను చేస్తానని రాహుల్ అంటాడు.
ఆ తర్వాత చాలా హ్యాపీగా ఉంది కావ్య.. నువ్వు ఆ పాపని మన బిడ్డ అని ఒప్పుకున్నందుకు అని రాజ్ అనగానే పాలు పట్టినంత మాత్రాన మన బిడ్డ అని ఒప్పుకున్నట్లు కాదని కావ్య అంటుంది. మరుసటి రోజు పాపని ఎత్తుకొని.. కావ్య బయట కూర్చొని మీ అమ్మ ఎక్కడ ఉందో.. మీ అమ్మ దగ్గరికి నిన్ను చేరుస్తానని కావ్య అంటుంది. అదంతా ఇంట్లో వాళ్ళు చూస్తారు. కావ్య ఎప్పుడు ఇలా ప్రవర్తించదు ఇలా చేస్తుందంటే తనని కూడా మనం నమ్మాలి.. పాప మారిపోయింది కావచ్చని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



