Jayam serial : లక్ష్మీని పనిమనిషిగా తీసుకొచ్చిన ఇషిక.. గంగపై శకుంతల ఫైర్!
on Dec 5, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -132 లో.....లక్ష్మీ మందుల ఖర్చు కోసం పని చెయ్యాలననుకుంటుంది. ఎవరు తనకి పని ఇవ్వరు. అదంతా ఇషిక చూసి కూతురు సొమ్ము వద్దనుకొని ఇలా పని వెతుకుంటున్నావా ఇదిగో అంటూ ఒక నోటు ఇషిక ఇస్తుంటే వద్దని లక్ష్మీ అంటుంది. ఏదైనా పని చేసి సంపాదిస్తానని లక్ష్మీ అంటుంది. ఈ రోజు ఇంట్లో.. నీ కూతురు చేతుల మీదుగా సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు లేరు.. నువ్వు వస్తావా.. లేదంటే అక్కడ పూజ ఆగిపోతుందని ఇషిక అనగానే వస్తాను కానీ నా కూతురు ఇంకా అమ్మగారు ఏమంటారోనని లక్ష్మీ అంటుంది.
వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడుదామని ఇషిక అనగానే.. లక్ష్మీ సరే అని తన వెంట వెళ్తుంది. మరొకవైపు ఇంట్లో అందరు పూజకి ఏర్పాట్లు చేస్తారు. నన్ను అడగకుండా ఎందుకు పూజ ఏర్పాట్లు చేస్తున్నారని పెద్దసారుతో శకుంతల అంటుంది. అందరి కోసం జరిపిస్తున్నానని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత శకుంతల కిచెన్ దగ్గరికి వెళ్లి ప్రసాదాలన్నీ గంగని చెయ్యమని చెప్పండి అని అంటుంది. అలా ఎలా ఇన్ని సంవత్సరాలు అవుతుంది.. పెళ్లి అయి.. అయినా నాకు ప్రసాదం చెయ్యడం రాదు.. ఆ గంగకి ఎలా వస్తుందని ఇందుమతి అంటుంది. అవును అది నిజమే అని శకుంతల అంటుంది. నేను చేస్తాను మా అమ్మ నేర్పించిందని గంగ అంటుంది.. సరే చెయ్ అని శకుంతల అంటుంది.
మరొకవైపు లక్ష్మీని తీసుకొని ఇషిక వస్తుంది. ఎక్కడికి వెళ్ళావ్.. ఇంట్లో పూజ జరుగుతుంటని ఇందుమతి అడుగుతుంది. ఇంట్లో పనిమనిషి లేదు కదా ఇదిగో తీసుకొని వచ్చానని ఇషిక అంటుంది. లక్ష్మీ మొహం కన్పించకుండా కవర్ చేస్తుంది. వెళ్లి పనులు చెయ్ పోమని లక్ష్మీతో శకుంతల చెప్తుంది. పూజ మొదలవుతుంది. గంగ ప్రసాదం చేస్తుంది. కానీ ఇషిక మార్చేస్తుంది. పూజ దగ్గర వట్టి ఉప్మా రవ్వ పెడుతుంది. అది చూసి పంతులు కోప్పడతాడు. అలా చేసింది గంగ అని శకుంతల తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



