Podarillu Serial: చక్రితో పెళ్ళికి ఒప్పుకున్న మహా.. ప్రతాప్ ఏం చేయనున్నాడు?
on Jan 15, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-28 లో.. చక్రి, మహా పోలీస్ స్టేషన్ లో ఉండగా ప్రతాప్, భూషణ్, ఆది వాళ్ళు వస్తారు. తనని తీసుకెళ్ళాలని ప్రతాప్ మహాని పిలిచి ఎమోషనల్ గా మాట్లాడుతాడు. భూషణ్ తో పెళ్ళి చేయనంటేనే వస్తానని మహా చెప్పగా నా పరువుకి సంబంధించిన విషయం ఇది అని ప్రతాప్ అంటాడు.
వాళ్ళను చూస్తూ ఎస్ఐ, కానిస్టేబుల్ ఇద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడి వచ్చారు కానీ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇది ఇష్టం లేదని కానిస్టేబుల్ అనగానే అవునని ఎస్ఐ అంటాడు.
మరోవైపు ఎస్ఐ తో మహా మాట్లాడుతుంది. ఈ జుట్టుపోలిగాడు ఎప్పుడయితే పెళ్ళిచూపులకి వచ్చాడో అప్పటినుండి మా నాన్నకి నాకు మధ్య దూరం పెరిగింది. నేను బాగా చదువుకున్నాను.. మంచి జాబ్ కూడా వచ్చింది.. కానీ మా నాన్న కోసం వద్దనుకున్నానని మహా అంటుంది. మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటమ్మా అని మహాని వాళ్ళ నాన్న ప్రతాప్ అంటాడు. అది వేరు నాన్న అని మహా అంటుంది. భూషణ్ చాలా టార్చర్ పెడతాడని, ఒకవేళ వాడికి నాకు పెళ్ళి జరిగితే మా ఇంటికి నాకు మధ్య దూరం పెరుగుతుందని ఎస్ఐ తో మహా అంటుంది. మహా వాళ్ళ నాన్న తన పరువు పోతుందని ఎంత రిక్వెస్ట్ చేసిన ఆమె వినిపించుకోదు. మీరు మీ పరువు కోసం చూస్తున్నారని, కానీ నాకు లైఫ్ ఉంటుందని మహా అంటుంది. నా మాట విను అమ్మ.. ఇంటికి వచ్చెయ్.. భూషణ్ ని పెళ్ళి చేసుకోమని మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అంటాడు. నేను చావనైనా చస్తాను కానీ వాడిని పెళ్ళి చేసుకోనని మహా అంటుంది.
ఇక ఎస్ఐ , కానిస్టేబుల్ ఇద్దరు మాట్లాడుకుంటారు. వారిద్దరికి పెళ్ళి జరిపించాలని అనుకుంటారు. మహాతో ఎస్ఐ, చక్రితో కానిస్టేబుల్ పర్సనల్ మాట్లాడతారు. మీ నాన్న మా పై అధికారులతో ఫోన్ లు మాట్లాడుతున్నాడు.. నిన్ను తీసుకెళ్ళిపోతాడు.. అతడిని చంపేస్తారని ఎస్ఐ చెప్పగా నా వల్ల అతడి ప్రాణాలు తీయడమెందుకు సర్.. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి అని ఎస్ఐ ని మహా అడుగుతుంది. దీనికి ఒక్కటే దారి.. మీకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే.. అతడిని పెళ్ళి చేసుకోండి అని ఎస్ఐ చెప్పగానే మహా షాక్ అవుతుంది. మీకు రెండు నిమిషాల టైమ్ ఇస్తున్నా డిసైడ్ అవ్వండి అని ఎస్ఐ, కానిస్టేబుల్ బయటకు వెళ్ళి టీ తాగడానికి వెళ్తారు.
ఇక మహా, చక్రి మాట్లాడుకుంటారు. మనమిద్దరం బయటకు వెళ్తే మీ నాన్న మీ పెళ్ళిని వాడితో చేస్తాడు. నన్నేమో చంపేస్తాడని చక్రి అంటాడు. నా గురించి అనవసరంగా మిమ్మల్ని చంపడం ఎందుకు అని మహా టెన్షన్ పడుతుంది. దీనికి ఒక్కటే దారి.. మనమిద్దరం పెళ్ళి చేసుకొని బయటకు వెళ్దాం.. ఆ తర్వాత ఎవరు మన వెంట పడరు.. నా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయని మహాతో చక్రి అంటాడు.
ఆ తర్వాత ఎస్ఐ, కానిస్టేబుల్ వచ్చాక అడుగగా.. ఈ పెళ్ళి మాకు ఇష్టమే అని చక్రి అనగానే మహా షాక్ అవుతుంది. ఇక అందరు మహాని చూడగా.. తన చేయి పట్టుకొని అవునని తలూపమంటాడు చక్రి. దాంతో సరే అన్నట్టుగా మహా మౌనంగా ఉండిపోతుంది. మరి మహా, చక్రిల పెళ్లిని ఎస్ఐ చేస్తాడా.. మహా వాళ్ళ నాన్న ప్రతాప్ ఏం చేస్తాడో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



