ఆ వీడియోపై స్పందించిన మెహబూబ్..!
on Oct 31, 2024
బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ (Mehaboob) హౌస్‌లో ఉన్నప్పుడు నబీల్‌తో ఓటింగ్ గురించి మాట్లాడాడు. మనకి ఓటింగ్ విషయంలో భయం అక్కర్లేదు.. ఎందుకంటే మన కమ్యూనిటీ ఓట్లన్నీ మనకే పడతాయి.. కానీ ఇద్దరూ నామినేషన్స్‌లో ఒకసారి ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒకేసారి ఇద్దరూ ఉంటే మన ఓట్లు డివైడ్ అయిపోతాయంటూ మెహబూబ్ అన్నాడు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. (Bigg Boss Telugu)
ఇక రీసెంట్ గా మెహబూబ్ ఎలిమినేషన్ అయి బయటకు వచ్చాడు. ఎవరు చూపించారో ఏమో కానీ నబీల్ తో మెహబూబ్ మాట్లాడింది చూసి.. దానికి రెస్పాండ్ అయ్యాడు. బిగ్‌బాస్‌లో మేము గంటలు గంటలు మాట్లాడితే వాళ్లు చూపించేది ముప్పై సెకన్లు. అందులో నేను మాట్లాడిన ఒక సంభాషణలో చిన్న క్లిప్ బయట వేరే కోణంలో వెళ్లింది. దాని గురించి మాట్లాడదామనే వచ్చాను.. మనం బిగ్‌బాస్ లాంటి పెద్ద ప్లాట్ ఫామ్‌లో ఉన్నప్పుడు మనం మంచిగా ఆడితే మనం మంచిగా బిహేవ్ చేస్తే అరె మనలో ఒకడు అని చెప్పి మనల్ని ఇష్టపడతారు.. మనకి ఓట్లు వేస్తారని చెప్పిన కన్వర్సేషన్ అది. ఉదాహరణికి మన తెలుగు పాట ఆస్కార్స్‌కి నామినేట్ అయినప్పుడు మన పాట గెలవాలని చెప్పి మనమందరం కోరుకున్నాం.. అలాంటి సంభాషణే అది. కానీ నేను అన్నమాట చాలా మందిని హర్ట్ చేసింది.. చాలా మంది డిజప్పాయింట్ అయ్యారు.. నేను ప్రామిస్ చేస్తున్నా అది నా ఉద్దేశం కాదు.. దానికి నేను క్షమాపణలు చెబుతున్నా సారీ. డబ్ స్మాష్, రీల్స్, యూట్యూబ్‌లో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ వచ్చాను.. ఏ కులం, ఏ మతం అనే ఫీలింగ్ లేకుండా మీరందరూ నన్ను సపోర్ట్ చేశారు. నేను స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ ఇస్తా.. ఆడియన్స్‌గా మీరందరూ గెలిచారు.. ఒక కంటెస్టెంట్‌గా నేను ఫెయిల్ అయ్యాను.. ఐయామ్ సారీ అంటూ మెహబూబ్ చెప్పాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
