యాంకర్ రష్మీకి అవకాశం నా వల్లే వచ్చింది..తమన్నా యాడ్ ఫిలిం నేనే చేశా..
on Jul 16, 2025
.webp)
కౌశల్ మంద అంటే చాలు బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ ఆర్మీ చేసిన హడావిడి, ఆ హంగామా గుర్తు రాకుండా ఉండదు. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆయనకు పెద్దగా అవకాశాలు ఐతే రాలేదు. ఇన్స్టాగ్రామ్ లో మాత్రం అప్డేట్ గా ఉంటాడు. కౌశల్ ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించాడు. అలాగే మూవీస్ కూడా సైడ్ క్యారెక్టర్స్ లో నటించాడు. చక్రవాకం, సూర్యవంశం సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఐతే జబర్దస్త్ యాంకర్ రష్మీ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. "ఎవరైనా నన్ను యాడ్ ఫిలిమ్స్ కోసం కానీ ఏదైనా అవకాశం కోసం అడిగినప్పుడు కష్టపడే వాళ్లకు హెల్ప్ చేయాలి అనుకుంటాను.
నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు వాళ్ళన్నా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మనకు వచ్చిన అవకాశాన్ని అవసరమైన వాళ్లకు చెప్తే కనీసం వాళ్ళు ఫేమ్ సంపాదించుకుంటారు, హ్యాపీగా ఉంటారు అనే నమ్మకంతో నేను చాలా మందికి హెల్ప్ చేసాను. జబర్దస్త్ కి ఒకప్పుడు అనసూయ గారు హోస్ట్ గా ఉండేవారు. ఎప్పుడైతే ఆవిడ యాంకరింగ్ మానేశారో ఆ షోకి ఏడుకొండలు అనే మేనేజర్ ఉండేవారు. ఆయన నాకు కాల్ చేసి ఎవరైనా యాంకర్ ఉంటే సజెస్ట్ చేయండి అన్నారు. అప్పుడు నేను వైజాగ్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ రష్మీ పేరును సజెస్ట్ చేశాను. నేను ఆమె నంబర్ ఇస్తే ఆ మేనేజర్ ఆమెకు కాల్ చేశారు. ఆ తర్వాత ఆమెకు ఆడిషన్ చేశారు సెలెక్ట్ అయ్యింది. అలా ఆమె జబర్దస్త్ కి యాంకర్ గా అయ్యింది. కనీసం నేను ఆమె నంబర్ ని జబర్దస్త్ మేనేజర్ కి ఇచ్చిన విషయం ఆమెకు కూడా ఇంతవరకు తెలీదు. నేను ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పుకోలేదు. అలా నేను చాలామందికి చాల రకాలుగా హెల్ప్ చేసాను. నా చెయ్యి నాకు లక్కీ కాదు కానీ వేరే వాళ్లకు లక్కీ. తమన్నా గారి యాడ్ ఫిలిం డైరెక్ట్ చేసింది నేనే. హ్యాపీ డేస్ తర్వాత భీమా సిమెంట్ గా యాడ్ ఫిలిం డైరెక్ట్ చేశాను...అలా నా హ్యాండ్ వేరే వాళ్లకు లక్కీ.. " అంటూ చెప్పుకొచ్చాడు కౌశల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



