Karthika Deepam2 : కార్తీక్, దీపల ప్లాన్ ని ఊహించిన జ్యోత్స్న.. తల్లిని కోప్పడిన కూతురు!
on Jun 11, 2025
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -380 లో.... శౌర్యని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది సుమిత్ర. ఇదిగో ఇవన్ని జ్యోత్స్న చిన్నప్పటి డ్రెస్ లు బొమ్మలు అని చూపిస్తుంది. అవి చూసి శౌర్యా మురిసిపోతుంది. జ్యోత్స్న ఫ్రాక్ శౌర్య వేసుకుంటుంది. నాకు బొమ్మలు కావాలంటూ సుమిత్రని అడిగి తీసుకుంటుంది శౌర్య.
తీసుకోమని వాళ్ళు చెప్తారు. ఇవన్నీ అమ్మకి చూపిస్తానని శౌర్య వెళ్ళిపోతుంది. పారిజాతం చెత్త ఏరుకొనే గెటప్ తో తమ ఇంటికి వచ్చినట్లు అనసూయ గుర్తుపడుతుంది. మరొకవైపు దీప గురించి జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. వీళ్ళు అందరు పెద్ద ప్లాన్ లోనే ఉన్నారని జ్యోత్స్నతో అంటుంది పారిజాతం. జ్యోత్స్న ఏదో మాట్లాడడానికి వస్తుంటే శౌర్య బొమ్మతో ఆడుతూ వస్తుంది. జ్యోత్స్నకి తగులుతుంది. ఏంటి ఆ బొమ్మలు.. అవి నావి ఈ డ్రెస్ కూడా నాదే ఎవరిచ్చారని జ్యోత్స్న కోప్పడుతుంది. ఆ తర్వాత శివన్నారాయణ దగ్గరికి కాంచన వస్తుంది కానీ శివన్నారాయణ కాంచన బాధపడేలా మాట్లాడతాడు.
నా బొమ్మలు డ్రెస్ ఎందుకు శౌర్యకి ఇచ్చావని సుమిత్రతో జ్యోత్స్న గొడవ పడుతుంది. తప్పేముంది ఇప్పుడు అవేవి నీకు అవసరం లేదు కదా అని సుమిత్ర దశరథ్ లు అంటారు. అయితే నా జ్ఞాపకాలు మీ దగ్గర వద్దని జ్యోత్స్న బొమ్మలు విసిరేస్తుంటే.. అవి అత్త మావయ్యల జ్ఞాపకాలు అంటూ కార్తీక్ వాటిని తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



