Karthika Deepam 2 : సుమిత్రని ఒప్పించిన జ్యోత్స్న.. దీప ఉండాలంట!
on Jul 5, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -402 లో.... గౌతమ్ ఫ్యామిలీని పంపించి కార్తీక్ లోపలకి వస్తాడు. జ్యోత్స్న పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలని కార్తీక్ అంటుంటే.. పనివాళ్ళు పనివాళ్ళలా ఉండండి అని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్న పెళ్లి జరగాలంటే దీప ఒక పని చెయ్యాలని సుమిత్ర అంటుంది. ఏంటి అమ్మగారు చేస్తానని దీప అనగానే.. జ్యోత్స్న పెళ్లి అయ్యేవరకు నువ్వు ఈ ఇంటి ఛాయలకి కూడా రావద్దని అనగానే దీప షాక్ అవుతుంది. దీప లేకుంటే ఈ ఎంగేజ్ మెంట్ జరుగుతుంది.. అదే దీప ఇక్కడ ఉంటే జరగదు అనుకున్న జ్యోత్స్న.. లేదు అమ్మ దీప ఉండాలని అంటుంది. దీప లేకుంటే గౌతమ్ పై వేసిన నింద నిజం అనుకుంటారు. అదే దీప కనిపిస్తే ఎవరికి సమాధానం చెప్పడం అవసరం లేదని జ్యోత్స్న అనగానే తప్పక సుమిత్ర సరే అంటుంది.
ఆ తర్వాత శివన్నారాయణ దగ్గరికి పారిజాతం వచ్చి.. నాకు ఒక పదిహేను లక్షలు కావాలని అడుగుతుంది. శివన్నారాయణ ఇవ్వనని అంటాడు. జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్లి కాశీ గాడికి సాయం చేద్దామని అనుకుంటే మీ తాత డబ్బు ఇవ్వను అన్నాడని పారిజాతం అంటుంది. నా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా.. నేను నీకు హెల్ప్ చేస్తానని జ్యోత్స్న అనగానే నీ ప్రాబ్లమ్ ఎక్కడ సాల్వ్ అయింది దీప వద్దని సుమిత్ర అనగానే నువ్వు ఉండాలి అన్నావ్.. అప్పుదు కార్తీక్ గాడి మొహం చూసాను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.. అంటే వాళ్ళు ఏదో ప్లాన్ లో ఉన్నట్టే కదా అని పారిజాతం అంటుంది.
మరొకవైపు సుమిత్ర మాటలకి దీప బాధపడుతుంటే.. కార్తీక్ వచ్చి ఈ జ్యోత్స్న కి గౌతమ్ గురించి తెలుసు.. ఈ పెళ్లి జరగనివ్వదు.. నువ్వు వెళ్లి జ్యోత్స్న ఈ పెళ్లి చేసుకోకు అని చెప్పకు నిన్ను బ్యాడ్ చేస్తుందని దీపతో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



