Jayam serial: పారుకి ఇచ్చిపడేసిన గంగ.. రుద్ర సూపర్ సపోర్ట్!
on Dec 3, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -130 లో..... రుద్ర ఉదయం నిద్ర లేచేసరికి గంగ ఇంకా పడుకొని ఉంటుంది. దాంతో ఇంతసేపు పడుకుంటావా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలని గంగను లేపుతాడు. మరొకవైపు తలనొప్పిగా ఉందని శకుంతల బాధపడుతుంది. వెంటనే ప్రీతీనీ కాఫీ తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది . ప్రీతి లేదని ఇందుమతి చెప్తుంది. ఇక వచ్చి రాని ఇంగ్లీష్ తో ఇందుమతి మాట్లాడుతుంటే శకుంతల తనపై కోప్పడుతుంది.
మరొకవైపు గంగతో రుద్ర బాక్సింగ్ ప్రాక్టీస్ చేపిస్తుంటే అప్పుడే పారు వస్తుంది. దమ్ముంటే నువ్వు నాతో ఆడి గెలువు అంటుంది. ఇద్దరు కాసేపు బాక్సింగ్ ఆడుతారు. పారు రూల్స్ బ్రేక్ చేసి గంగని ఎటాక్ చేస్తుంది. నువ్వు కూడా గ్లౌస్ తీసి ఆడమని గంగకి రుద్ర చెప్తాడు. దాంతో గంగ గ్లౌస్ తీసి పారుకి గట్టిగా చెంపపై షాట్ ఇస్తుంది. ఏంటి ఇలా ఆడుతున్నావని పారు అనగానే తను బానే ఆడుతుంది నువ్వే రూల్స్ బ్రేక్ చేసావని రుద్ర అంటాడు.
ఆ తర్వాత గంగని బావగారు సపోర్ట్ చేస్తూపోతే అది బాక్సింగ్ లో పేరు పొందితే దానికే మనం సేవ చెయ్యాలని శకుంతలతో ఇషిక అంటుంది. అప్పుడే శకుంతలకి పారు ఫోన్ చేసి గంగని నాతో పోటీపడు అన్నందుకు నన్ను రూల్స్ బ్రేక్ చేసి కొట్టింది. రుద్ర తనకి సపోర్ట్ గా ఉన్నాడు. మీకు కోడలు కావాలని ఆశపడ్డాను.. నాకు మా అన్నయ్య మంచి సంబంధం తీసుకొని వస్తాడని పారు చెప్తుంది. నువ్వేం అలా అనకు ఎప్పటికైనా నువ్వే ఈ ఇంటికి కొడలు అని శకుంతల చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



