Jayam serial: గంగ మీద శకుంతల సీరియస్.. రుద్ర గుర్తిస్తాడా?
on Feb 15, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -193 లో... గంగ కోపంగా పారు దగ్గరికి వెళ్లిందని రుద్రని లేపడానికి వంశీ, సూర్య ట్రై చేస్తారు. ఎంట్రా అని రుద్ర అడుగగా.. నువ్వు పారు వల్లే బాధపడ్డావని వదిన కోపంగా పారుని చంపడానికి వెళ్లిందని సూర్య చెప్పాగానే రుద్ర బయల్దేరతాడు.
మరొకవైపు గంగ నుండి తప్పించుకోవడానికి పారు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి హెల్ప్ మీ అంటూ అరుస్తుంది. ప్లీజ్ ఒకమ్మాయి నన్ను చంపడానికి వస్తుంది. నన్ను సెల్ లో వెయ్యండి అని లోపలికి వెళ్లి సెల్ కి తాళం వెయ్యమని లేడీ కానిస్టేబుల్ కి చెప్తుంది.
గంగ వెనకాలే వచ్చి.. ఏంటే నా నుండి ఈ రోజు తప్పించుకోలేవే అంటూ గట్టిగా అరుస్తుంది. సెల్ లో ఉన్నా ఒక అబ్బాయి సాయంతో పారు దగ్గర నుండి గంగ తాళం తీసుకుంటుంది. అప్పుడే ఇన్‌స్పెక్టర్ వస్తాడు. సర్ మీకు ఆ పారు గురించి తెలియదు.. మీరు ఇప్పుడు రెండు కంప్లైంట్ లు రాసుకోవాలి.. ఒకటి భాను గారిని చంపింది ఎవరనేది.. ఇంకొకటి ఈ పారు గురించి అని గంగ కంప్లైంట్ రాస్తుంది.
అప్పుడే పారు కానిస్టేబుల్ ఫోన్ అడిగి రుద్రకి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్తుంది. గంగ సెల్ ఓపెన్ చేయబోతుంటే రుద్ర వస్తాడు. గంగ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని కోప్పడి తనని ఇంటికి తీసుకొని వెళ్తాడు.
గంగ అలా పారుపై గొడవకి వెళ్లింనందుకు శకుంతల కోప్పడుతుంది. నేను ఏ తప్పు చెయ్యలేదు.. తప్పు చేసిన వాళ్లే దర్జాగా తిరుగుతున్నారని గంగ అంటుంది. నువ్వు ఇంకా బస్తీ పైడిరాజు కూతురు లాగే బిహేవ్ చేస్తున్నావ్.. ఈ ఇంటికి కోడలన్న విషయం మర్చిపోకని శకుంతల కోప్పడుతుంది.
మరుసటి రోజు ఉదయం గంగ ఇంట్లో అందరికి కావల్సిన టిఫిన్ చేసి పెడుతుంది. అదంతా రుద్ర చూస్తాడు. రుద్రకి గంగ జ్యూస్ తీసుకొని వస్తుంది. ఇంట్లో అందరికి చాకిరీ చేసి అలిసిపోయినట్లున్నావ్.. నువ్వు తాగు అని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



