నన్ను తట్టుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ?.. యాంకర్ రష్మీ
on Jun 12, 2025

జబర్దస్త్ ఇక కొత్త ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ న్యూ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. కృష్ణ భగవాన్, ఖుష్బూ ఇద్దరూ కూడా కొత్తగా కనిపించబోతున్నారు. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ ఈ షో కొత్తగా రాబోతోందన్న విషయం తెలుస్తోంది. "ఇక నుంచి జబర్దస్త్ కొత్తగా ఉండబోతోంది..ఎనర్జీ డబుల్, ఎంటర్టైన్మెంట్ డబుల్. ఎవ్రిథింగ్ డబుల్ " అంటూ ఖుష్బూ మంచి ఎలివేషన్ ఇచ్చింది. "ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది. ఇప్పుడు జబర్దస్త్ లో ఆడియన్స్ ఉన్నారు" అంటూ కృష్ణ భగవాన్ చెప్పారు.
"అన్ని డబులా" అని రష్మీ అనుమానంతో అడిగేసరికి "అన్ని డబుల్ ఐతే యాంకర్ కూడా డబుల్ అవ్వాలిగా" అంది జడ్జ్ ఖుష్బూ. " నన్ను తట్టుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా" అని రష్మీ అడిగింది. ఐతే ప్రోమో లాస్ట్ లో కొత్త జెంట్ యాంకర్ ని సైడ్ లుక్ లో చూపించారు. ఐతే ఆ కొత్త యాంకర్ సుధీర్ ఆ, మానస్ ఆ అన్నది చూపించలేదు. ఐతే నెటిజన్స్ మాత్రం కొంతమంది సుధీర్ అంటుంటే కొందరు మానస్ అంటూ మెసేజెస్ చేస్తున్నారు. ఐతే ఈ సీరియల్స్ టైమింగ్స్ ని మాత్రం మార్చలేదు. ఇక రష్మీకి జోడీ ఉండే కో-యాంకర్ ఎవరు అన్నది ఈ శుక్రవారం షోలో తెలిసిపోతుంది. మానస్ కళ్ళజోడు తీసి పెట్టే మ్యానరిజంతో సుధీర్ అన్న ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫాన్స్. ఇక జడ్జ్ గా శివాజీ వెళ్లిపోవడంతో ఈ కామెడీ షోకి జడ్జ్ గా కృష్ణ భగవాన్ గారే కరెక్ట్ అంటూ కూడా మెసేజ్ పెడుతున్నారు నెటిజన్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



