Illu illalu pillalu : విశ్వ గొంతుపట్టుకొని వార్నింగ్ ఇచ్చిన రామరాజు.. అవమానించిన భద్రవతి!
on Feb 4, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -73 లో.......సాగర్, చందు, తిరుపతి లు మాట్లాడుకుటంటే.. అప్పుడే ధీరజ్ వస్తాడు. నేను ఈ రోజు ఇక్కడే పడుకుంటానని అంటాడు. అప్పుడే నర్మద వచ్చి.. టైమ్ చాలా అవుతుంది. పడుకోరా అని సాగర్ దగ్గరికి వస్తుంది. నర్మద ఈ ఒక్క రోజు ఇక్కడే పడుకుంటానని అనగానే సరే అంటు నర్మద వెళ్ళిపోతుంటుంది. నర్మదని ఎలా రిక్వెస్ట్ చేస్తున్నావ్ రా అంటూ తిరుపతి సాగర్ ని ఆట పట్టిస్తాడు. ముందు ఎవరు ప్రేమించారని సాగర్ ని తిరుపతి అడుగగా.. నేను కాదు, ముందు తనే నన్ను ప్రేమించమని వెంటపడిందని సాగర్ బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అదంతా నర్మద విని నీ సంగతి చెప్తానని అనుకుటుంది.
నువ్వు చెప్పేదేది నమ్మాలనిపించడం లేదని సాగర్ ని అటపట్టిస్తాడు తిరుపతి. ఆ తర్వాత అందరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి అందరు పడుకున్నాక ధీరజ్ దగ్గరికి రామరాజు వచ్చి.. తన దెబ్బలు చూసి ఎమోషనల్ అవుతాడు. తన కన్నీటి చుక్క ధీరజ్ చెయ్ పై పడుతుంది. ఆ తర్వాత ధీరజ్ లేచి నాన్న ఇక్కడికి వచ్చాడు.. నా దగ్గరికి వచ్చాడంటూ సాగర్ కి చెప్తూ ఎమోషనల్ అవుతాడు.
మరుసటి రోజు ఉదయం నర్మద ముగ్గు వేస్తుంటే.. సాగర్ వచ్చి మాట్లాడతాడు. రాత్రి ఏదో అంటున్నావంటూ సాగర్ ని సరదాగా బెదిరిస్తూ ఉంటే అప్పుడే చందు వస్తాడు. అన్నయ్య నర్మదకి ముగ్గు ఎలా వెయ్యాలో చెప్తున్నానని సాగర్ అంటుంటే.. అంత చూసానులే అంటూ చందు అంటాడు. రామరాజు వెళ్తుంటే విశ్వ తన ఫ్రెండ్స్ తో కన్పిస్తాడు. దాంతో రామరాజు వెళ్ళి విశ్వ గొంతు పట్టుకొని.. నా కొడుకు జోలికి ఇంకొకసారి వస్తే బాగుండదంటు వార్నింగ్ ఇస్తాడు. తరువాయి భాగంలో రామరాజుని భద్రవతి పిలిచి.. ఎంత దైర్యంరా నా అల్లుడు గొంతు పట్టుకోవడానికి అంటుంది. అదేనా పెంపకమని రామరాజు అనగానే.. నీదేనా పెంపకం.. నీ పెద్ద కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు.. తాగి రోడ్డుపై పడిపోతున్నాడు. ఆ విషయం మిగతా కొడుకులకి కూడా తెలుసని భద్రవతి అనగానే.. రామరాజు షాక్ అవుతాడు. ఇక బాధతో లోపలికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



