ENGLISH | TELUGU  
Home  » TV News

Illu Illalu Pillalu: సాగర్ జాబ్ వెనుక ఉన్న రహస్యం తెలుసుకున్న భాగ్యం.. రామరాజు ఆశీర్వదిస్తాడా?

on Feb 15, 2026

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu Illalu Pillalu)'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-395లో.. భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావు కలిసి మాట్లాడుకుంటారు. నా చెంపమీద కొట్టింది ఆ నర్మద. దాని అంతు చూడాలని శ్రీవల్లి అనగానే మనం విలన్లు అమ్మ.. అప్పుడప్పుడు హీరోయిన్ల చేతిలో ఇలా చెంపదెబ్బలు కామన్ కానీ మనం వాళ్ళ జీవితం మీద కొట్టాలని భాగ్యం ప్లాన్ చెప్తుంది. ఆ సాగర్ కి అంత ఈజీగా జాబ్ ఎలా వస్తుంది. కచ్చితంగా లంచం ఇచ్చే ఉంటాడు.. అది నిజమేనా కాదా.. అసలు అంత డబ్బు సాగర్ కి ఎక్కడిదో తెలుసుకోవాలని భాగ్యం చెప్తుంది. దాంతో ముగ్గురు సాగర్ దగ్గరికి బయల్దేరి వెళ్తారు. 

 

మరోవైపు సాగర్ ఆఫీస్ కి  రెడీ అవుతుంటాడు. అప్పుడే నర్మద వస్తుంది. గెటప్ అదిరింది అని నర్మద పొగిడేస్తుంది. ఆఫీస్ లో పై ఆఫీసర్లతో గౌరవంగా ఉండు, నీతోటి వాళ్ళతో ప్రేమతో ఉండు, నీ కింద ఉన్నవాళ్ళతో మర్యాదగా ఉండు అంటు సాగర్ కి జాగ్రత్తలు చెప్తుంది నర్మద. నువ్వు ఉండగా నాకేంటి ప్రాబ్లమ్.. నువ్వు చూసుకుంటావ్ గా అని సాగర్ అనగానే నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఉండు నీకోసం లంచ్ బాక్స్ తీసుకొస్తానని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది నర్మద. 

 

అప్పుడే భాగ్యం, ఆనందరావు ఇద్దరు సాగర్ దగ్గరికి వస్తారు. కంగ్రాట్స్ నడిపి అల్లుడు అంటూ భాగ్యం, ఆనందరావు చెప్తారు. మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాసారు అని భాగ్యం అడుగగా.. లాస్ట్ మంత్ పదిహేను అంటాడు. అప్పుడు సంక్రాంతి హాలిడే కదా అని భాగ్యం అనగానే అది కాదు పదహారు అని సాగర్ కవర్ చేస్తాడు. గవర్నమెంట్ జాబ్ అంటే మాములు విషయం కాదు భారీగా ఇచ్చుకోవాలి కదా మీరు ఎంత ఇచ్చారని భాగ్యం అడుగగా.. ఇరవై అయిదు అని సాగర్ అంటు ఆగిపోతాడు. ఆ తర్వాత నర్మద వస్తుంది. ఇక భాగ్యం, ఆనందరావు వెళ్తారు.

 

మరోవైపు ప్రేమ ఎగ్జామ్ రాయడం కోసం రెడీ అవుతుంటే ధీరజ్ వస్తాడు. ఏంటే ఈ డ్రెస్ బాలేదంటూ వేరే డ్రెస్ ఇస్తాడు. ఆ తర్వాత తనని ముస్తాబు చేస్తాడు ధీరజ్. ఇక ప్రేమ తనని చూసి మురిసిపోతుంది. 

 

ఆ తర్వాత అందరు హాల్లోకి వస్తారు. రామరాజు హాల్లో కుర్చీలో కూర్చొని టీ తాగుతూ పేపర్ చదువుతుంటాడు. అప్పుడే అక్కడికి సాగర్, నర్మద, ధీరజ్, ప్రేమ, చందు, శ్రీవల్లి, భాగ్యం, వేదవతి వస్తారు‌. ఇక మిల్ తాళాలు శ్రీవల్లి చేతుల మీదుగా చందుకి ఇస్తుంది‌. ఆ తర్వాత చందుని ఆశీర్వదిస్తాడు రామరాజు. సాగర్ ని ఆశీర్వాదం తీసుకోమంటుంది నర్మద. ఇక సాగర్ వాళ్ళ నాన్న కాళ్ళు మొక్కుతుంటే రామరాజు కాళ్ళు వెనక్కి తీసుకుంటాడు. సాగర్ హార్ట్ అయి బాధగా వెళ్తుంటే వేదవతి ఆపి ఆశీర్వాదం ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.