Jayam serial : మందు తాగేసిన భార్య.. గదిలోకి ఎత్తుకెళ్ళిన భర్త!
on Jan 22, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -174 లో.....గంగ దగ్గరికి ఇషిక, వీరు వస్తారు. నీకు బాక్సింగ్ సెట్ కాదు అని హేళన చేసి మాట్లాడుతుంటే ఇద్దరికి గంగ వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు సూర్య వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిందని కిచెన్ లోకి వచ్చి మందు బాటిల్ లో నుండి మందుని వాటర్ బాటిల్ లో కలుపుకుంటాడు. అప్పుడే శకుంతల వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఏం లేదు పెద్దమ్మ జలుబు అయింది హాట్ వాటర్ పెట్టుకుంటున్నానని అంటాడు. నేను కషాయం ఇవ్వనా అని అడుగుతుంది. పర్లేదని సూర్య అంటాడు.
సూర్య ఆ బాటిల్ ని తీసుకొని వెళ్లి హాల్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే రుద్ర వస్తాడు. ఏంటి అన్నయ్య అలా ఉన్నావని సూర్య అడుగగా పెద్దనాన్న క్లాస్ తీసుకున్నాడని రుద్ర చెప్తాడు. రుద్రకి తినడానికి ఏదో తీసుకొని రావడానికి సూర్య వెళ్తాడు. అప్పుడే అటుగా వెళ్తున్న గంగ తనలో తను మాట్లాడుకుంటూ కనిపిస్తే రుద్ర పిలుస్తాడు. రుద్రతో గంగ మాట్లాడుతుంటే తనకి వెక్కిళ్లు వస్తాయి. దాంతో హాల్లో ఉన్న బాటిల్ లో ఉన్నవి వాటర్ అనుకొని గంగకి రుద్ర ఇవ్వగా తను తాగుతుంది. ఇక ఆ తర్వాత తాగి మైకంలో మాట్లాడుతుంది. ఏంటి ఇలా బెహేవ్ చేస్తుందని రుద్ర అనుకుంటాడు. అప్పుడే సూర్య వచ్చి ఈ బాటిల్ లో వాటర్ నువ్వు తాగావా అని రుద్రని అడుగగా గంగ తాగిందని రుద్ర చెప్తాడు. అప్పుడే వంశీ వస్తాడు.
వంశీకి విషయం అర్థమవుతుంది. వంశీ, సూర్య ఇద్దరు అది మందు అని రుద్రకి చెప్తారు. దాంతో రుద్ర వెంటనే గంగ దగ్గరికి వెళ్తాడు. గంగకి గదిలోనే ఉండమని రుద్ర చెప్తాడు కానీ గంగ వినకుండా ఇషిక, వీరు దగ్గరికి వెళ్లి మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు మందు తాగావ్ కదా అత్తయ్యకి చెప్తానని ఇషిక అనగానే అక్కడ దొరికిపోయేది మీ ఆయన అని వంశీ అంటాడు. సైలెంట్ గా ఉండు ఇషిక అని సూర్య చెప్తాడు. ఆ తర్వాత గంగని రుద్ర ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్తాడు. మీరంటే నాకు చాలా ఇష్టం సర్ అని గంగ అంటుంది. సరే నువ్వు పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



