Home

»

Tv News

Eto Vellipoindi Manasu : డిటెక్టివ్ లిస్ట్ లోకి అభి.. సీతాకాంత్ మనసులో ఏం ఉందంటే!

Oct 31, 2024 12:14PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -240 లో.....అభి ఎందుకు వచ్చాడని రామలక్ష్మి ఆలోచిస్తుంటుంది. సీతా సర్ కి ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చెయ్యాలని చూస్తున్నాడా అని రామలక్ష్మి బాధపడుతుంది. మరొకవైపు సీతాకాంత్ కూడా అభి గురించి ఆలోచిస్తూ.. అసలు అభి విషయం రామలక్ష్మి ఎందుకు చెప్పడం లేదు.. నేను బాధపడుతానని అనుకుంటుందా.. ఒకసారి అభి గురించి చెప్తే ఇంకొకసారి జోలికి రాకుండా చేస్తాను.. అయిన రామలక్ష్మి ఎందుకు చెప్పడం లేదని సీతాకాంత్ ఆలోచిస్తాడు.

ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లని సిరి పిలుస్తుంది. మీరు భోజనానికి ఎందుకు రాలేదు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు.. నా గురించే ఎప్పుడు ఆలోచిస్తారు.. అలాంటింది మీరు తినకుండా ఉంటే నాకెలా అనిపిస్తుందంటూ ఇద్దరికి సిరి భోజనం తినిపిస్తుంది. మరుసటి రోజు ఇక రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లోనే బాధపడుతూ ఉంటుందని శ్రీలత, శ్రీవల్లీ ఇద్దరు అనుకుంటారు. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్ లు ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అయి వస్తుంటారు. రామలక్ష్మి కావాలనే సీతాకాంత్ చెయ్ పట్టుకొని వస్తుంది. ఏంటి అత్తయ్య ఇంత ప్రేమగా ఉంటారని అనుకోలేదా అని వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత శ్రీలత శ్రీవల్లి ఇద్దరికి రామలక్ష్మి కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత నందిని దగ్గరికి సందీప్ వెళ్లి.. నన్ను ఎండీని చేస్తానన్నావ్ అసలు పట్టించుకోవడం లేదని అంటాడు. అదేం లేదు టైమ్ చూసుకొని ఎండీ చేస్తానని నందిని అంటుంది.

ఆ తర్వాత సీతాకాంత్ డిటెక్టివ్ కి ఫోన్ చేసి అభి ఫోటో పంపించి.. అసలేం చేస్తున్నాడు ఎవరిని కలుస్తున్నాడని తెలుసుకోమని సీతాకాంత్ చెప్తాడు. మరోవైపు టైమ్ అయిందని. ఇక వెళ్లి సీతా సర్ తో భోజనం చెయ్యాలని రామలక్ష్మి అనుకుంటుంది. మరొకవైపు డిటెక్టివ్ అభి ఫోటో పట్టుకొని వెతుకుతుంటాడు. ఆ తర్వాత నందిని టైమ్ అవుతుంది... భోజనం చెయ్ అని హారిక అనగానే.. సీతాతో కలిసి చేస్తానని నందిని అంటుంది. సీతాతో రామలక్ష్మి భోజనం చేస్తుందని హరిక చెప్పగానే నందిని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com