Illu illalu pillalu : రామరాజు ఎమోషనల్.. ప్రేమకి ప్రపోజ్ చేసిన ధీరజ్!
on Feb 17, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -396 లో..... సాగర్ ఆఫీస్ కి మొదటి రోజు వెళ్తున్నానని వేదవతికి చెప్తాడు. మంచిగా వర్క్ చేసుకోమని వేదవతి చెప్తుంది రామరాజు కోపంగా చూస్తాడు. సాగర్ బయటకు వెళ్తాడు. నర్మద తనకి ఎదురు వచ్చి అల్ ది బెస్ట్ అని చెప్తుంది. ధీరజ్ నువ్వు ఈ రోజు నీతో పాటు ప్రేమని కూడా తీసుకొని వెళ్ళు ఒక్కదానికే బోర్ కొడుతుందని వేదవతి అనగానే సరే అమ్మ అని ధీరజ్ అంటాడు. మీరేం అంటారని రామరాజుని వేదవతి అడుగుతుంది. దానికి రామరాజు సరే అంటాడు.
ప్రేమ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానని రామరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. థాంక్స్ మావయ్య ఒప్పుకున్నందుకు అని ప్రేమ అంటుంది. ప్రేమని తీసుకొని ధీరజ్ బయటకు వస్తాడు. నాన్న మిల్ కి వెళ్తున్నానని చందు చెప్తాడు. నువ్వు ఒక్కడివేరా నన్ను అర్థం చేసుకుందని రామరాజు అంటాడు. అమ్మ లవల్లి అల్లుడు గారు మిల్ కి వెళ్తున్నాడు.. తాళాలు నీ చేత్తో ఇవ్వు.. మీ మావయ్య గారికి మీ అత్తయ్య ఇచ్చేది కదా అని భాగ్యం అనగానే శ్రీవల్లి తాళాలు తీసుకొని వచ్చి చందుకి ఇస్తుంది. శ్రీవల్లి తాళాలు ఇస్తుంటే వేదవతి తను రోజు రామరాజుకి తాళాలు ఇచ్చేది గుర్తుచేసుకుంటుంది. చందు మిల్ కి వెళ్తుంటే మీరు కూడా వెళ్ళండి అల్లుడు గారికి సాయంగా అని ఆనందరావుతో భాగ్యం అంటుంది. మీరెందుకు బాబాయ్ తిరుపతి బాబాయ్ ఉన్నాడు కదా అని నర్మద అంటుంది.
మీరు వెళ్ళండి బావ గారు తిరుపతిని వేరే పని మీద బయటకు పంపించాను.. అయినా మధ్యలో బాధ్యతలు వదిలేసిన వాళ్ళకి ఎందుకని రామరాజు అంటాడు. మరొకవైపు ప్రేమని తీసుకొని ధీరజ్ కార్ లో వెళ్తుంటే ధీరజ్ తన ప్రేమని చెప్పాలని ట్రై చేస్తాడు. ఆ తర్వాత ప్రేమని ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్లి తనకి సర్ ప్రైజ్ ఇస్తాడు. అక్కడ బెలూన్ లతో డెకరేషన్ చేసి ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్ డే అని రాసి ఉంటుంది. ప్రేమకి రోజ్ ఇచ్చి తన ప్రేమని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



