75 వేలతో మ్యూజిక్ వీడియో సాంగ్ థీమ్ తో డాన్స్ ఐకాన్
on Apr 24, 2025
డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమో మాత్రం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది. ఐతే ఈ రాబోయే కాన్సెప్ట్ ఏంటంటే మ్యూజిక్ వీడియోస్ థీమ్ అన్నమాట. ఒక్కో కంటెస్టెంట్ కి 75 వేలు ఇచ్చామని ఆ డబ్బులతోనే ఫస్ట్ వీడియో సాంగ్ ని షూట్ చేయాలి అంటూ యాంకర్ ఓంకార్ టాస్క్ ఇచ్చాడు. దాంతో మానస్ కంటెస్టెంట్ చిరాశ్రీ సాగరిక ఐతే "ధీవర" అనే సాంగ్ కి డాన్స్ వీడియో చేసి చూపించింది. ఈ డాన్స్ కి ఫారియా కాంప్లిమెంట్ ఇచ్చింది. "మూవ్మెంట్స్ సాండ్ లాగా చాలా స్మూత్ గా ఉన్నాయి. చూడడానికి చాలా యూనిక్ గా ఉంది"అని చెప్పింది. ఇక బెనీత ఐతే "జేజమ్మ" సాంగ్ కి వీడియో సాంగ్ చేసింది. ఇక ఈ సాంగ్ షాట్స్ అన్నీ కూడా రెండు గంటల్లో చేసేశాం అని మెంటార్ యష్ మాష్టర్ చెప్పేసరికి శేఖర్ మాష్టర్ కూడా షాకయ్యాడు. ఇక విపుల్ రాకీ భాయ్ సాంగ్ కి డాన్స్ వీడియో చేసేసరికి దీపికా ఫుల్ ఫిదా ఐపోయింది.
బర్కత్ అరోరా ఐతే "చిన్ని చిన్ని ఆశ" సాంగ్ కి డాన్స్ చేసింది. అది చూడడానికి కూడా ఎంతో క్యూట్ గా ఉంది. ఫైనల్ గా ముమైత్ ఖాన్ కంటెస్టెంట్ అన్షికా మంచి హాట్ పెర్ఫార్మెన్స్ కి డాన్స్ చేసింది. "పరేషానురా" పాటకు చేసిన హాట్ స్టెప్స్ కి యష్ మాష్టర్ ఫిదా ఐపోయాడు. "యష్ నువ్వు అన్షికా పెర్ఫార్మెన్స్ చూసి పరేషాన్ అయ్యావా లేదా" అని ఓంకార్ అడిగేసరికి "అయ్యాను" అన్నాడు . ఫారియా కూడా మూవీలో ఉండే యాక్షన్ సాంగ్ లా అనిపించింది అంటూ పొగిడేసింది. మరి ఈ ఫైనల్ ఎలిమినేషన్ లో ఎవరు ఉండబోతున్నారు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది కొంత సస్పెన్సు గా ఉంచాడు ఓంకార్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
