Brahmamudi : ఆస్తిని ముక్కలు చేయాలన్న కోడలు.. కుప్పకూలిన ఇంటి పెద్దాయన!
on Dec 5, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -585 లో....కళ్యాణ్ బయటకు వెళ్తుంటే.. అప్పు దగ్గర ఉండి రెడీ చేస్తుంది. అప్పుడే అనామిక వస్తుంది. టీ, కాఫీ లు అందించడానికి వెళ్తున్న భర్తని బానే రెడీ చేస్తున్నావని అనామిక అనగానే.. అప్పు ఆశ్చర్యంగా చూస్తుంది. కళ్యాణ్ రైటర్ లక్ష్మీకాంత్ దగ్గర పని చెయ్యడానికి వెళ్తున్నాడని అనామిక చెప్తుంది. అప్పుకి కళ్యాణ్ చెప్పిన అబద్ధం అనామిక చెప్పి వెళ్ళిపోతుంది. నీకు ఆ విషయం చెప్తే బాధపడతావని చెప్పలేదు కానీ నీకు అబద్దం చెప్పాలని కాదని కళ్యాణ్ అనగానే.. అప్పు అర్ధం చేసుకుంటుంది.
మరొకవైపు ఇంట్లో ఎవరు లేరని ధాన్యలక్ష్మిని రుద్రాణి రెచ్చగొట్టే పనిలో పడుతుంది. ఇప్పుడు వెళ్లి అందరూ కావ్యని తీసుకొని వస్తారు. ఇక ఆస్తులు ముక్కలు చేసి.. నీ కొడుకు న్యాయం ఎలా చేస్తారంటూ ఒక ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత కావ్య, అపర్ణలని తీసుకొని సీతారామయ్య, ఇందిరాదేవిలు వస్తుంటారు. అప్పుడే హాల్లో ధాన్యలక్ష్మి ఊరేసుకోవాలని ట్రై చేస్తుంది. కావ్య, అపర్ణ ఇద్దరు ధాన్యలక్ష్మిని దింపుతారు. ధాన్యలక్ష్మి చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. ఈ రుద్రాణి మాటలు విని ఇదంతా చేస్తున్నావా అంటూ ఇందిరాదేవి, అపర్ణ కలిసి ధాన్యలక్ష్మిని తిడతారు.
ఆ తర్వాత ఆస్తులు ముక్కలు చెయ్యాలని ధాన్యలక్ష్మి డిమాండ్ చెయ్యడంతో సీతారామయ్య కింద పడిపోతాడు. అతన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా అంటూ ధాన్యలక్ష్మిని ఇందిరదేవి తిడుతుంది. తరువాయి భాగంలో సీతారామయ్య కావ్య దగ్గర ఇంట్లో నుండి బయటకు వెళ్లొద్దంటూ మాట తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



