Brahmamudi : అత్తకి నిజం చెప్పేసిన కోడలు.. తన పుట్టినరోజు గిఫ్ట్ అదే!
on Apr 15, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -695 లో.....కావ్య ఆఫీస్ లో ఉండగా తన క్లయింట్స్ వచ్చి డబ్బు పే చెయ్యలేదని అడుగుతారు. దాంతో అదేంటీ ఇంకా పేచెయ్యలేదా అని కావ్య మేనేజర్ ని పిలిచి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఆ తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్ మళ్ళీ రిపీట్ కాకూడదని మేనేజర్ కి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత కావ్య ఇంటికి వెళ్తుంది. కావ్య కోసం అప్పు బయట వెయిట్ చేస్తుంది.
అక్క నీ కోసమే వెయిట్ చేస్తున్నా బావ ఉన్నాడని మనకి తెలుసు కానీ ఆ విషయం తెలియక అత్తయ్య రోజు రోజుకి ఆరోగ్యం పాడుచేసుకుంటుందని అప్పు అనగానే.. ఆ సంగతి నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకని అప్పుతో కావ్య అంటుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కావ్య వెళ్తుంది. ఎందుకు అత్తయ్య మీ కొడుకు బ్రతికే ఉన్నాడంటే నమ్మట్లేదని కావ్య అంటుంది. ఎలా నమ్మమంటావ్ రాజ్ ఒక నీకే కన్పిస్తున్నాడు.. మాకెందుకు కన్పించడం లేదని అపర్ణ అడుగుతుంది. ఎందుకంటే ఆయన గతం మర్చిపోయాడని కావ్య అనగానే అపర్ణ షాక్ అవుతుంది. జరిగిందంతా అపర్ణకి కావ్య చెప్తుంది. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని అపర్ణ అడుగుతుంది. చెప్తే మీరు తనకి గతం గుర్తుచేసే ప్రయత్నం చేస్తారు. అలా చేస్తే తన ప్రాణానికే ప్రమాదమని కావ్య అంటుంది. నాకు ఒక్కసారి రాజ్ ని చూపించు లేదంటే ఇదంతా అబద్ధమని అనుకుంటానని అపర్ణ అంటుంది.
సరే చూపిస్తా కానీ మీరు తనకి గతం గుర్తు చేసే ప్రయత్నం చెయ్యొద్దని కావ్య అంటుంది. మీ పుట్టినరోజున అయన చేతుల మీదుగానే గుళ్లో అన్నదానం జరుగుతుందని కావ్య అనగానే అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రాజ్ ని ఎలా ఒప్పించాలని కావ్య ఆలోచిస్తుంది. అప్పుడే రాజ్ ఫోన్ చేస్తాడు. నేను ఇప్పుడు కూరగాయలు తీసుకొని రావడానికి వెళ్ళాలని కావ్య అనగానే నేను వస్తానని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో ఏంటి వదిన గుళ్లో ఏదో నీ కొడుకే అన్నదానం చేస్తున్నట్లు హ్యాపీగా వెళ్తున్నావని రుద్రాణి అనగానే.. మరి నా కొడుకే చేసేదని అపర్ణ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



