Bigg Boss Buzz Ramu Rathod: బజ్ ఇంటర్వ్యూలో రాము రాథోని ఉతికారేసిన శివాజీ.. బిగ్ బాస్ కోట్ల మంది కల!
on Nov 10, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం నాటి ఎపిసోడ్ లో రాము రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే రాము రాథోడ్ ఆడియన్స్ ఓటింగ్ తో బయటకు రాలేదు కానీ సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాక రాము రాథోడ్ బజ్ ఇంటర్వ్యూకి వచ్చాడు.
బజ్ ఇంటర్వ్యూకి రాము రాథోడ్ రాగానే శివాజీ క్వశ్చన్స్ మొదలెట్టాడు. నాతో ఫ్రీగా ఉండు.. భయపడకుండా ఉండు అని శివాజీ అన్నాడు. ఇక రాము రాథోడ్ ని కాస్త హుషారు చేయడానికి.. 'రాను బొంబాయి కి రాను' అనే పాటకి డ్యాన్స్ చేపించాడు. ఈ పాటని చేయడానికి ఎన్ని రోజులు పట్టిందని శివాజీ అడగగా.. దాదాపు ఐదు సంవత్సరాలు పట్టిందని రాము చెప్పాడు. ఒక సక్సెస్ రావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. కానీ, బిగ్ బాస్ హౌస్‌లో కప్పు కొట్టడానికి పదిహేను వారాలే చాలు కదా అంటూ శివాజీ అన్నాడు. ఎవరైనా బిగ్ బాస్ షో చూడడానికి మాత్రమే వస్తామనుకుంటే హౌస్ లోకి రాకండి. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం అంటే బస్సు ఎక్కడం కాదు. ఇది కోట్ల మందికి కల. నీకు కావాలంటే వస్తా, వెళ్లిపోతానని అనడం సరైంది కాదంటూ శివాజీ ఫైర్ అయ్యాడు. బయట కూడా ఇలానే ఉంటావా రామూ.. నీ క్లారిటీ ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించాడు. బయట క్లారిటీగా ఉంటానని రాము సమాధానం ఇవ్వగానే.. మరి కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావని శివాజీ అడిగాడు. హౌస్‌లో ప్రతీ ఒక్కరి మెంటాలిటీ వేరుగా ఉంటుంది. మాటలతో మాయ చేస్తారన్నాడు. అంటే మాటలతో మాయ చేస్తే మారిపోతావా అని శివాజీ అడిగాడు. లేదని రాము చెప్పాడు. బయట కూడా ఇలా జరిగితే దూరం అవుతావా అని శివాజీ అడుగగా.. అదేం లేదని రాము అన్నాడు.
ఇక ఆ తర్వాత హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌పై అభిప్రాయం అడిగాడు. మొదట సంజనా ఫోటో చూపించగా.. లక్కీ అనే బోర్డు చూపించాడు రామ్. అంటే సంజన లక్కీ తో లాక్కొస్తుందా అని శివాజీ అడుగగా.. అక్కడ స్కోప్ లేకుండా సరే.. ఆమె అందులోకి దూరిపోతుందంటు రాము చెప్పాడు. నువ్వు దూరతావు కానీ మాట్లాడవు, ఆమె దూరితే ఏదో చేస్తుంది కదా అంటూ శివాజీ అన్నాడు. అవును సర్ అంటూ రాము జవాబిచ్చాడు. మొన్నటి ఎపిసోడ్ లో గౌరవ్ సంజనను లాగాడా లేక ఆమెనే దిగిందా అని శివాజీ ప్రశ్నించగా.. నేను సరిగ్గా చూడలేదని బదులిచ్చాడు రాము. వెంటనే శివాజీ రాము బాయ్, తుమారా కన్ఫ్యూజ్ హోరా బాయ్ అంటూ శివాజీ అన్నాడు. ఇలా శివాజీ అడిగే ప్రశ్నలకి కాసింత కన్ఫ్యూజ్ అవుతూనే సమాధానమిచ్చాడు రాము. మరి రాము సెల్ఫ్ ఎలిమినేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



