బిగ్ షాక్..ఆనందరావు - సౌందర్య వెళ్లిపోతున్నారా?
on Jan 27, 2022

బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `కార్తీక దీపం`. ఈ సీరియల్ ద్వారా డాక్టర్ బాబు గా నటిస్తున్న నిరుపమ్, వంటలక్కగా నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ స్టార్ సెలబ్రిటీలుగా మారిపోయారు. వీరి గురించి సెలబ్రిటీలే చర్చించుకునే స్థాయిలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. గత కొన్ని వారాలుగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ తాజాగా కొంత క్రేజ్ తగ్గి షాకిస్తోంది. అయినా ఈ సీరియల్ కు ఆదరణ మాత్రం తగ్గడం లేదు.
Also Read: కూతురి కోసం రూ. 149 కోట్ల ఇంటిని బాగుచేసిన ప్రియాంక జోడీ!
ఈ గురువారం 1260వ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. హోటల్ లో కార్తీక్ పని చేయడం చూసిన దీప ఆవేశంగా ఊగిపోతూ కార్తీక్ ని కాలర్ పట్టుకుని నిలదీస్తుంది. మీరు ఇలాంటి పనులు చేయడం ఏంటని బోరున విలపిస్తుంది. బాబుని తీసుకుని ఇంటికి వెళ్లండి అంటూ డాక్టర్ బాబుపై అరవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Also read: మాల్దీవుల్లో బికినీతో కేకపుట్టిస్తున్న కత్రినా! విక్కీ ఎక్కడ?
కట్ చేస్తే.. ఆశ్రమంలో పని చేసే ఓ వ్యక్తి ఆనందరావు దగ్గరికి వచ్చి మేడం రుద్రాణిని కొట్టిన దగ్గరి నుంచి మీ గురించి ఎవరెవరో ఎంక్వైరీ చేస్తున్నారని, మీరు ఇక్కడ వుండటం క్షేమం కాదని వేరే ఆశ్రమం చూసుకోండని చెబుతాడు. గురవుగారు మీ క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతాడు. మరి అతని మాటలు విన్న ఆనందరావు, సౌందర్య ఆ ఆశ్రమం నుంచి వెళ్లిపోయారా? .. వెళ్లిపోతే కార్తీక్ , దీప ఏం చేశారు? .. అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



