
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ బాబు ఇప్పుడు డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ ని నిరూపించుకుంటున్నాడు. ఆయన తెరకెక్కించిన *లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్* వెబ్ సిరీస్ ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఈటీవీ విన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సిరీస్ ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉన్న బాబు.. ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. తన లవ్ స్టోరీని బయటపెట్టాడు . బాబు తనకు కాబోయే భార్య పేరు అమూల్య అని చెప్పాడు . ప్రస్తుతం ఆమె ఓ స్థానిక టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా చేస్తోందని లాక్‌డౌన్‌కు ముందు అమూల్య టిక్‌టాక్‌లో వీడియోలు చూసి ప్రేమలో పడినట్లు చెప్పాడు . అప్పటికే సోషల్ మీడియాలో ఆమెకు 7 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండేవారు. ఆమె వీడియోలకు లైకులు కొడుతూ, కామెంట్లు చేస్తూ, మెసేజ్‌లు పంపించేవాడినని గుర్తుచేసుకున్నాడు . అయితే ఆమె మాత్రం మొదట్లో తనను పట్టించుకోలేదన్నాడు. ఒకసారి హైదరాబాద్‌లో అనుకోకుండా అమూల్య ఎదురుపడినా.. ఆమెతో మాట్లాడే ధైర్యం చేయలేకపోయానన్నాడు . ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా గుర్తింపు వచ్చాక ఎలాగోలా ఆమె ఫోన్ నంబర్ సంపాదించి కాల్ చేసినా ఆమెకు తాను నచ్చకపోవడంతో తన నంబర్‌ను బ్లాక్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని చెప్పాడు.
లాక్‌డౌన్ తర్వాత మరోసారి అమూల్యకు ఫోన్ చేస్తే ఆమె సోదరుడు ఫోన్ లిఫ్ట్ చేయడంతో, ఆ తర్వాత మెల్లగా అమూల్యతో మాట్లాడే అవకాశం దొరికిందని చెప్పాడు . అప్పటికే ఆమె కూడా హైదరాబాద్‌లోనే స్థిరపడటంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగిందని, వీలున్నప్పుడల్లా కలుసుకునేవాళ్లమన్నాడు .
తన జీవితంలో కష్టకాలం ఎదురైనప్పుడు అమూల్య అండగా నిలిచిందని తన దగ్గర డబ్బులు లేని రోజుల్లో ఆర్థికంగా ఆదుకుందని గుర్తుచేసుకున్నాడు .
అమూల్య తన ఐదు నెలల జీతాన్ని దాచిపెట్టి మరీ తనకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిందన్నారు . ఆమె చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు . జబర్దస్త్‌లో తాను ఎదగడానికి, డైరెక్టర్ కావడానికి ఆమె ఎంతో సపోర్ట్ చేసిందని చెప్పాడు. కనీసం ఒక్క మూవీ అయినా చేసి, కెరీర్‌లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ ఐనట్లు చెప్పాడు. ఇక ఇప్పుడు ఇద్దరి ఇళ్లల్లో తమ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలోనే మ్యారేజ్ డేట్ ని రివీల్ చేస్తానన్నాడు.






