
బుల్లితెర మీద మెహబూబ్ దిల్ సే ఒక కంటెంట్ క్రియేటర్ గా, డాన్సర్ గా, యాక్టర్ గా చేస్తున్నాడు. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఉంటాడు. శ్రీ సత్యతో కలిసి నువ్వే కావాలి అనే మ్యూజిక్ వీడియో చేసాడు. అలాగే పాపులర్ వెబ్ సిరీస్ "సింగల్ కింగులం", గుంటూరు మిర్చి, గోదావరి ప్రేమ కథలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే బిగ్ బాస్ సీజన్ 4, 8 లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళాడు. అలాంటి మెహబూబ్ కు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి 11 ఏళ్ళు ఐన సందర్భంగా ఒక గోల్డెన్ ప్లే బటన్ ని సంపాదించాడు. ఆ విషయాన్నీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.
‘‘యూట్యూబ్‌లో 11 ఏళ్లు పూర్తయ్యాయి. పదేళ్లకు పైగా ప్రతిరోజూ కష్టపడుతూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. నిజం చెప్పాలంటే.. ఒకప్పుడు నేను ప్రయాణం చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మొదట్లో ఈ రంగం నాకు సరిపోదని ఎన్నో సార్లు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేను మాత్రం ఆగలేదు. కష్టపడ్డాను, కొత్త విషయాలు నేర్చుకున్నాను, ఎదిగాను. ప్రతిరోజూ ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. సిరీస్‌ల నుంచి ఎన్నో వ్లాగ్స్, షార్ట్స్ వరకు.. మీ అందరినీ ఎంటర్‌టైన్ చేయడం, మీ ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ ప్రయాణంలో నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎప్పుడూ నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. నన్ను ప్రోత్సహించినందుకు సంతోషంగా ఉంది . కొన్ని సందర్భాల్లో నాపై నాకే నమ్మకం లేనప్పుడు కూడా నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. నేను ఇంకా ఎంతో సాధించగలనని నాకు గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు . ముఖ్యంగా.. ఈ 11 సంవత్సరాల్లో మీరు నాపై చూపించిన ప్రేమ, అభిమానం, ఆదరణకు ఎప్పటికీ కృతజ్ఞుడినే. ఈ ప్రయాణం ఎన్నో అనుభవాలను ఇచ్చింది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. అదే సమయంలో ఎన్నో అందమైన క్షణాలను, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను కూడా సంపాదించుకున్నాను. అయితే ఇది ముగింపు కాదు ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇకపై కూడా ఇలాగే కష్టపడతాను. కొత్త కంటెంట్‌ను క్రియేట్ చేస్తాను. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను. మీ అందరినీ గర్వపడేలా చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. యూట్యూబ్‌లో 11 ఏళ్లు పూర్తయ్యాయి.. కానీ ముందుంది జీవితాంతం ప్రయాణం’’ అంటూ మెహబూబ్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.




.webp)

