
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 591 లో....వల్లీ, భాగ్యం, ఆనందరావు ముగ్గురూ ప్రేమను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నర్మదకు అప్పగించి, తన గురించి నిజం బయటకు చెప్పకుండా బతిమాలాలని ప్లాన్ వేస్తారు. ప్రేమ ఈజీగా రాదు కాబట్టి రుమాలుకు మత్తుమందు రాసి వాసన చూపించి తీసుకురావాలని అనుకుంటారు. ఇది పని చేస్తుందో లేదోనని ఆనందరావు అంటాడు. టెస్ట్ చేస్తానంటూ వల్లీయే ఆ రుమాలు వాసన చూసి మత్తులోకి జారుకుంటుంది. దీంతో భాగ్యం, ఆనందరావు, వల్లీని ఓ పక్కన కూర్చోబెట్టి, నువ్వు ఇక్కడే ఉండు మేం ప్రేమను తీసుకొస్తానని లోపలికి వెళ్తారు.
లోపలికి వెళ్లిన వారిని రౌడీలు చూసేయడంతో ఆనందరావు తెలివిగా భాగ్యం చేయి పట్టుకుని కరెంట్ షాక్ కొట్టినట్టు చేస్తాడు. దాంతో రౌడీలకు షాక్ కొట్టి వాళ్లుపడిపోతారు. ఇంతలో మత్తులో ఉన్న వల్లీ మాత్రం.. ప్రేమను ఎత్తుకొచ్చేశా అంటూ ఒక పెద్ద మూటను ఈడ్చుకుంటూ వస్తుంది. నిజంగానే ప్రేమే అనుకుని ముగ్గురూ కలిసి ఆ మూటను మోసుకుంటూ నర్మద ఉన్న కారు దగ్గరకు వెళ్తారు. ప్రేమను తెచ్చేశాం, ఇక వెళ్దామని అంటారు. నర్మదకు అనుమానం వచ్చి.. నిజంగా ప్రేమేనా, క్లాత్ తీయండి అనడంతో తీరా చూస్తే అందులో ఉన్నది ప్రేమ కాదు, చింతామణి. దీంతో నర్మద.. మిమ్మల్ని నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ అంటూ కోపంగా వెళ్లిపోతుంది.
మరోవైపు పెళ్లి మండపంలో అందరూ ప్రేమ కోసం ఎదురుచూస్తుంటారు. ప్రేమను తీసుకొచ్చానని మా చావును తీసుకొచ్చావ్ కదా అంటూ భాగ్యం, ఆనందరావు వల్లీని కొడతారు. ప్రేమ ఇక రాదేమోనని రామరాజు అంటాడు. ప్రేమ కచ్చితంగా ముహూర్తం టైంకి వస్తుందని ధీరజ్ నమ్మకంగా చెప్పి పూజ మొదలుపెట్టమని పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. నర్మద ఇళ్లంతా వెతికినా ప్రేమ కనిపించదు. వేదవతి ఫోన్ చేసి.. సరిగ్గా వెతికావా అని కేకలేస్తుంది.. ముహూర్తం టైం అయిపోతుంది, టైం దాటితే ప్రేమ నా కొడుకు జీవితంలో నుంచి వెళ్లిపోతుందంటూ ఏడుస్తుంది. ముహూర్తం టైంకి ప్రేమను తెస్తానని నర్మద మాట ఇస్తుంది.
సరిగ్గా ముహూర్తం టైంకి ఊహించని ట్విస్ట్ జరుగుతుంది. ప్రేమ నేరుగా పెళ్లి మండపానికి వస్తుంది. వేదవతి ఆమెను చూసి సంతోషంతో.. ప్రేమ వచ్చేసిందని అరుస్తుంది. కానీ ప్రేమ పెళ్లి పీటల మీదకు వెళ్లకుండా, నేరుగా వెళ్లి గెస్టులా మొదటి వరుసలో కూర్చోవడంతో అందరు షాక్ అవుతారు. ఇక్కడ కూర్చున్నావేంటే, రెడీ అవుదువు పదా అని వేదవతి అంటుంది. మరోవైపు వల్లీకి మత్తు వదిలించడానికి ముఖం కడుగుతారు, శ్రీవల్లి చింతామణి ముఖం మీద నీళ్లు చల్లుతుంది. భాగ్యం ఆమెను ఇంటి ముందు వదిలేద్దాం అని ప్లాన్ వేస్తుండగా, చింతామణి కళ్లు తెరిచి భాగ్యం వాళ్ళ ని పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Illu Illalu Pillalu, Illu Illalu Pillalu Episode 591, Star Maa Serial, Prema, Dheeraj, Narmada, Valli, Bhagyam, Anandarao, Chintamani, Vedavathi, Ramaraju]





(7).webp)
