Home

»

Tv News

Brahmamudi: సిరి నిజం చెబుతుందా.. రాజును ఇరికించేందుకు రేఖ కొత్త స్కెచ్!

Sep 25, 2026 9:09AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'Brahmamudi. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 1145 లో... రేఖ ఆస్తి కోసం లాయర్ ని ఇంటికి పిలిపించడంతో పెద్ద రచ్చ జరిగింది. రాజు ఎంట్రీ ఇచ్చి లాయర్ ని తిప్పి పంపించడంతో రేఖ ప్లాన్ ఫెయిల్ అయింది. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు ఈ ఆస్తి దక్కనివ్వనని రాజు వార్నింగ్ ఇస్తే.. సిరి నీ మొదటి భార్య కదా.. దాన్ని ప్రూవ్ చేసి నిన్ను ఇంట్లోంచి బయటకు పంపిస్తానని రేఖ సవాల్ చేస్తుంది. దీంతో ఇంట్లో టెన్షన్ మొదలైంది. సిరి ఎవరు, రాజుకు సిరితో నిజంగానే పెళ్లయితే ఇందును ఎందుకు పెళ్లి చేసుకున్నావు..  హాస్పిటల్ ఫైల్ లో భర్తగా ఎందుకు సంతకం చేశావంటూ రాజును అపర్ణ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే నాపై నమ్మకం ఉంచండి.. నిజం చెప్పాల్సిన రోజు వస్తుందని చెప్పి రాజు తప్పించుకున్నాడు.

 

అసలు నిజం తెలియాలంటే సిరి గతం తవ్వాలని రేఖ గ్యాంగ్ ప్లాన్ వేసింది. శేషు ఇచ్చిన ఐడియాతో సిరి ద్వారానే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటే ఆధారాలు దొరుకుతాయని భావించారు. దీంతో భ్రమరం సిరి దగ్గరకు వెళ్లి పులసు ఆట ఆడుతూ.. ఆటలో ఓడిపోతే తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని కండిషన్ పెట్టింది. సిరి మైండ్ సెట్ ఆరేళ్ల దగ్గరే ఆగిపోయినా తన తల్లిదండ్రుల గురించి చెప్తుందని శేషు ధీమాగా ఉన్నాడు.

 

మరోవైపు రేఖ కంటే ముందే సిరి పూర్తి వివరాలు తెలుసుకోవాలని రాజు, ఇందు ప్రయత్నాలు మొదలుపెట్టారు. యాక్సిడెంట్ జరిగిన రోజు సిరి వాళ్ల బండి నంబర్ ఆధారంగా ఇందు ఆరా తీస్తుంది. ఆ బండి శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు మీద ఉందని తెలియడంతో అతనే సిరి తండ్రి అయ్యుండొచ్చని అనుమానించి ఇద్దరూ ఆ అడ్రెస్ కు బయలుదేరారు. తరువాయి భాగంలో రాజు, శేషు ఇద్దరు మందు తాగుతూ ఉండగా భ్రమరం సిరి గురించి ఆరా తీస్తుంటుంది. దాన్ని దూరం నుంచి చూసి ఇందు టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే 

 

 

 

[Brahmamudi, Brahmamudi Episode 1145, Star Maa Serial, Raju, Indu, Siri, Rekha, Aparna, Bhramaramba, Sheshu, Property Dispute]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com