(3).webp)
బుల్లితెరపై అత్యంత ఆసక్తికరంగా మారిన రియాలిటీ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రసారమవుతున్న అగ్నిపరీక్ష సీజన్ 2 సెలెక్షన్ ప్రక్రియ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. గత సీజన్ తో మొదలైన ఈ ప్రక్రియ ఇప్పుడు రెండో సీజన్ మొదలైంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. అపూర్వ స్టేజ్ మీదకి ఫుల్ ఎనర్జీతో వచ్చేసింది. యాంకరింగ్ చేస్తుంది, న్యూస్ ప్రజెంటర్ లాగా మాట్లాడుతుంది. మొదట్లో నవదీప్ ఆమె మాటలకు, స్టైల్ కి తెగ నవ్వి డైరెక్ట్ గా గ్రీన్ కూడా ఇచ్చేసాడు. ఈ అమ్మాయి ఎంటర్‌టైన్ చేస్తుందనే ఫీల్ అందరికి వచ్చింది. కానీ కథ చెప్పడం మొదలు పెట్టగానే అసలు టెస్ట్ స్టార్ట్ అయ్యింది.
అపూర్వ ఒక పాయింట్ లో.. పురుషాధిక్యత లేని ప్లేస్ అంటే అది ఒక్క బిగ్ బాస్ షోనే, అక్కడ అందరు సమానమే అని అనేసింది. అంతే, జడ్జ్ లు ఆ మాటని పట్టుకున్నారు. నవదీప్, బిందు మాధవి రెడ్ ఇచ్చారు. పైగా అభిజిత్ గురించి అతని ఆట నచ్చలేదు, చదువు గురించి మాట్లాడు అది కూడా నచ్చలేదని కూడా అనేసింది. దీంతో అభిజిత్ కూడా..నా ఒపీనియన్ చెప్పడం తప్పా? మా ఇంట్లో మా అమ్మే హెడ్డు, ఒకరికి జరిగిన దాన్ని అందరికీ అంటగట్టడం కరెక్ట్ కాదని రెడ్ ఇచ్చాడు.
కానీ నవదీప్ మాత్రం.. వచ్చినప్పుడు ఎలా ఎంటర్‌టైన్ చేసిందో, ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉందని గ్రీన్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు. అంటే అపూర్వలో కాన్ఫిడెన్స్, మాట్లాడే ధైర్యం ఉంది. కానీ జనరల్ స్టేట్‌మెంట్స్ వేసినప్పుడు మాత్రం జడ్జ్ లు లైట్ తీసుకోరని ప్రూవ్ అయ్యింది. హౌస్ లోపలికి వెళ్తే ఆమె యాంకర్ స్కిల్స్ ఎంత వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.




(2).webp)
.webp)
