అదితి భావరాజు గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరమే లేదు. ఆమె ఒక ఫేమస్ నేపథ్య గాయని. ఈమె తెలుగు, తమిళ చిత్రాలకు పని చేసింది. ఇండియన్ ఐడల్‌లో పాల్గొంది. ఎం.ఎం. కీరవాణి, ఎస్. ఎస్. థమన్, దేవి శ్రీప్రసాద్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేసింది. ఆమె వివిధ భాషలలో ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది. వాటిల్లో ఆమెకు బాగా పేరు తెచ్చినవి కొన్ని. అఖండలో "జై బాలయ్య " తమిళ్ ఎనిమి మూవీలా "టం-టం" సాంగ్, తెలుగు ఏబీసీడీ మూవీలో "మెల్ల మెల్లగా", పలాస మూవీలో "బావొచ్చాడు" సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇక సాంగ్స్ తో పాటు తన యాక్టింగ్ స్కిల్స్ కి పదును పెట్టింది అదితి. 'దండోరా' మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. అలాంటి అదితి రీసెంట్ గా బిగ్ బాస్ మీద కొన్ని కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 10 కి సింగర్ అదితి భావారాజు వెళ్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఐతే ఆ విషయాన్నీ ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. "అలాంటి కబుర్లేమీ లేవండి. అసలు బిగ్ బాస్ కి వెళ్లే ఇంటరెస్ట్ లేదండి. మంచి మేము ఇంట్లో పాప్ కార్న్ పెట్టుకుని చూసే ప్రోగ్రాం తప్ప అందులో ఉండే ప్రోగ్రాం కాదు . నవ్వుకుంటూ బిగ్ బాస్ లోకి వెళ్లి ఏడుస్తూ రాకుండా ఉంటే చాలు. బిగ్ బాస్ గుడ్. కానీ నేను ఇంట్లోనే రెండు రోజులు ఉండలేనండి. ఆ ఇంట్లో 100 రోజులు ఎలా ఉంటానండి. చాలా కష్టం అన్ని రోజులు ఉండడం. బిగ్ బాస్ వాళ్ళు నన్ను ఎవరూ అప్ప్రోచ్ అవలేదు. నేను ఎవరినీ రిజెక్ట్ చేయలేదు " అని చెప్పింది అదితి భావరాజు.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బిగ్‌బాస్ అందరినీ ఏడిపించి పంపిస్తుంది...ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన అదితి భావరాజు!
Jun 7, 2026 2:47PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




