
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో శ్రీముఖి ఐదు జంటలకు రకరకాల టాస్కులు ఇచ్చింది. అలాగే ఎపిసోడ్ లాస్ట్ లో వాళ్ళ క్యారక్టర్ కి తగ్గ అవార్డ్స్ ఇచ్చింది. నటరాజ్ మాష్టర్ - నీతూకి "మిస్టర్ ఓజి -మిస్సెస్ క్రేజీ " అని ఇచ్చింది. "ఎలా ఉంది ఈ అవార్డు గెలుచుకోవడం" అని శ్రీముఖి అడిగింది. "రియాలిటీ షో అంటే రియల్ గా ఉండాలి కదా. నాకు ఏది వస్తే అది చెప్పేసాను. అరుచుకోకుండా. నువ్వు అరిస్తే ఆరుపేమో..నేను అరిస్తే గోడ్జిల్లా కూడా గజగజ లాడాల్సిందే. అర్దమయ్యిందా రాజా " అని తన స్టైల్ లో చెప్పారు నటరాజ్ మాస్టర్.
ఇక పవన్ కళ్యాణ్ - వసంతికి "మిస్టర్ ఆవేశం - మిస్సెస్ ఆయాసం " అనే అవార్డుని ఇచ్చింది. ఇక నూకరాజు - ఆసియాకి "మిస్టర్ విఒలెంత్ - మిస్టర్ సైలెంట్" అనే అవార్డు ఇచ్చింది. ఇక తర్వాత మహేష్ - సాండ్రాని పిలిచింది శ్రీముఖి. వీళ్లకు "మిస్టర్ మ్యానిఫెస్టేషన్ - మిస్సెస్ మెడిటేషన్ " అనే అవార్డుని ఇచ్చింది. ఫైనల్ జాను - భానుని పిలిచింది. "మిస్టర్ గ్లో - మిస్సెస్ స్లో" అనే అవార్డ్స్ ని ఇచ్చింది. అలాగే హౌస్ లో కపుల్స్ ki నచ్చిన వాటిని తీసుకోవచ్చు అని చెప్పింది. ఐతే అది తీసుకోవాలంటే గేమ్ ఆడాలని చెప్పింది. ఇక వాసంతి - పవన్ కళ్యాణ్ ఆ లవర్ గురు మాట్లాడే హార్ట్ షేప్ ని కోరుకుంది.




.webp)
.webp)
