Home

»

Tv News

శ్రీముఖి...గర్ల్ ఫాన్స్‌తో సరదా ముచ్చట్లు!

Apr 09, 2026

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఇందులో శ్రీముఖి బేబీ పింక్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఇక పక్కన బాలు ఉండేసరికి ఆమె ఇంకా అందంగా వెలిగిపోయింది . ఐతే బాలు కోసం కొంతమంది గర్ల్ ఫాన్స్ ఈ స్టేజి మీదకు వచ్చారు. "ఇంత మంది లేడీ ఫాన్స్ ఆ బాలుకి . మీకు జెలస్ గా అనిపించట్లేదా" అంటూ హరి శ్రీముఖిని అడిగాడు. "నాకెందుకు జెలస్ అనిపిస్తదిరా వాళ్ళ ఓటింగ్ వల్లే కదా  ఆయన పాపులర్ హీరో అయ్యాడు. " అని చెప్పింది శ్రీముఖి. "ఎవరెవరికి బాలుని హగ్ చేసుకోవాలని అనిపిస్తుందో వాళ్ళు హగ్ చేసేసుకోండి " అంటూ గర్ల్ ఫాన్స్ కి చెప్పి కళ్ళు మూసుకుంది. "మేము శ్రీముఖి అక్కకు లోయల్  గా ఉందామనుకుంటున్నాం " అంటూ ఒక ఫల్ ఫ్యాన్ చెప్పింది. ఇంతలో ఇంకో గర్ల్ ఫ్యాన్ ఐతే "హాయ్ బాలు అన్న. నేను మీకు పెద్ద ఫ్యాన్.

మీ స్మైల్ చాలా బాగుంటుంది" అంది. ఇంతలో హరి వచ్చి "ఆ స్మైల్ కె అమ్మగారి పడిపోయారు " అన్నాడు. ఇంకో గర్ల్ ఫ్యాన్ ఐతే " మ్యాడ్ ఫర్ ఈఅచ్ అదర్  షోకి మీరు కూడా కపుల్ గా వెళ్తే చూడాలనుంది " అని చెప్పింది. "మా అత్తమ్మ నన్ను ఇంకా జోడీగా ఒప్పుకోవడం లేదు ఆమెకు ఏమన్నా చెప్పొచ్చుగా నువ్వు " అనేసరికి ఆ గర్ల్ ఫ్యాన్ వెంటనే "అత్తయ్య కొంచెం అక్కని బావగారితో సెట్ చేసేయండి " అంది .

ఇక తర్వాత "నీకు ఓట్ చేసిన ఆడియన్స్ అందరికీ మీరు ఎం చెప్పాలనుకుంటున్నారు " అంటూ శ్రీముఖి బాలుని అడిగింది. "జనాలంతా వోట్ వేసి గెలిపించారు కాబట్టి ఆ అవార్డు ని వాళ్ళ చేతుల మీదుగా కూడా తీసుకోవాలని అనుకుంటున్నా " అన్నాడు. ఆ తర్వాత గర్ల్ ఫాన్స్ అంతా కలిసి ఆ అవార్డుని బాలుకి ఇచ్చారు. టీ షర్ట్స్ మీద థాంక్యూ బాలు అని రాసి ఇచ్చాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com