Home

»

Tv News

తమన్నా సింహాద్రి పొలిటికల్ పోస్ట్ వైరల్

Jul 27, 2026 2:39PM


తమన్నా సింహాద్రి అంటే బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ అలాగే ఫేమస్ హోస్ట్ శ్రీముఖికి మంచి ఫ్రెండ్ కూడా. ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద సెన్సేషన్ సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అలాగే తమన్నా సింహాద్రి రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. హోమ్ శాఖ మంత్రి అంటూ ఒక అఫీషియల్ చైర్ లో కూర్చుని ఉన్న పిక్ ని కూడా పోస్ట్ చేసింది. "తమన్నా సింహాద్రి హోమ్ శాఖ మంత్రి ఐతే ఎం మహిళల భద్రతకు అండగా నిలిచి, ప్రజలకు చట్టం అంటే ఏంటో చూపిస్తుంది.  నిర్భయ నాయకురాలు, ఉక్కు సంకల్పం ఉన్న మహిళా " అంటూ కూడా కొన్ని లైన్స్ కూడా ఆ పిక్ మీద రాసుకుంది.

ఇక నెటిజన్స్ ఈ పోస్ట్ చూసి "కంగ్రాట్యులేషన్స్, మీ వెంట మేమున్నాం, ఆల్ ది బెస్ట్, వెయిటింగ్ అక్క " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా సింహాద్రి ఫామిలీ పొలిటికల్ ఫామిలీ.  తమన్నా పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ గతంలో టీడీపీ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు.  ఇక తమన్నా గతంలో  ఏపి   అసెంబ్లీ ఎన్నికల్లో  జనసేన తరఫున మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావించింది. అయితే వామపక్షాలతో పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని జనసేన కమ్యూనిస్టు పార్టీకి కేటాయించే సరికి  తమన్నా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. అప్పటి మంత్రి నారా లోకేశ్‌పై ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిగా పోటీ చేయడం మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే ఎన్నికల ఫలితాల్లో తమన్నాకు  ఓట్లు లభించలేదు. అయినప్పటికీ ఆమెకు  ప్రచారం లభించింది.  అదే గుర్తింపు ఆమెకు బిగ్‌బాస్‌లో అవకాశం తెచ్చిపెట్టింది.  ట్రాన్స్‌జెండర్ కంటెస్టెంట్‌గా ఆమె   సీజన్‌కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక పొలిటికల్ పోస్ట్ తో తమన్నా సింహాద్రి మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com