Home

»

Tv News

Godhavari : పెళ్లి ఉచ్చులో పడ్డానని ఏడ్చిన నందు.. జాను ఓదార్పు!

Jul 17, 2026 10:56AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -58 లో.... నన్ను మీరు కావాలనే ఈ పెళ్లి ఉచ్చులో పడేసి బావతో పెళ్లి అయ్యేలా ప్లాన్ ప్రకారం చేశారని నందు ఏడుస్తుంది‌. అలా కాదని జాను చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ నందు అసలు వినదు.. కోపంగా నందు లోపలికి వెళ్తుంది. నందు మాటలకు జాను బాధపడుతుంది. ఒక దగ్గర ఒంటరిగా కూర్చొని జాను బాధపడుతుంటే అప్పుడే సూర్య తనకి రోస్ ఫ్లవర్ ఇస్తాడు.

తన మొహంలో బాధ చూసి ఏమైందని అడుగుతాడు. అక్కకి బావకి పెళ్లి అయింది కానీ ఆ సంతోషమే లేదని తన భుజాలపై పడుకొని ఎమోషనల్ అవుతుంది జాను. తన మాటలతో ధైర్యం చెప్తాడు సూర్య. మరి మన పెళ్లి ఎప్పుడు అని సూర్య అడగుగానే నీ డెస్టినీని అడుగు అని జాను అంటుంది. నాకే కౌంటర్ వేసావా అని సూర్య అంటాడు. మరొకవైపు శాంతి దగ్గరికి మురళి వెళ్తాడు. ఆ పెళ్లి వద్దనుకొని వచ్చావారా అని శాంతి హ్యాపీగా ఫీల్ అవుతుంది వెనకాలే ఉన్న పెద్దావిడ శారదని చూసి శాంతి షాక్ అవుతుంది. ఓహ్ రాయబారానికి వచ్చారా అని శాంతి కోప్పడుతుంది. అసలు నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఈ అమ్మ గుర్తు రాలేదా అని కోప్పడుతుంది.  గొడవ చేస్తావనుకొని నేనే వద్దన్నానని మురళి చెప్తాడు. దయచేసి వాళ్ళ పెళ్లిని ఒప్పుకోండి వదిన అని శారద రిక్వెస్ట్ చేస్తుంది. పెద్దావిడ కూడా రిక్వెస్ట్ చేస్తుంది. అయినా సరే శాంతి పట్టించుకోదు.

దాంతో వాళ్ళు వెనక్కి వస్తారు. ఆ తర్వాత నందుని చూసి ఇంటికి వచ్చినవాళ్ళు పిల్ల చాలా గడుసుగా ఉంది. ఆ శుభకార్యం కూడా జరిపించండి అని అంటారు. దాంతో వాళ్ళని పంపించేస్తుంది నందు. ఆ తర్వాత మురళి వస్తాడు. మురళి కాఫీ తీసుకొని రా అని పెద్దావిడ చెప్పగానే నందు తీసుకొని వచ్చి తనపై పడబోస్తుంది. దాంతో వాళ్లకి శోభనం జరిపించాలి.. అప్పుడే సెటిల్ అవుతారని పెద్దావిడకి ఆలోచన వస్తుంది. తరువాయి భాగంలో నందు మురళికి శోభనం ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com