.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -10 లో... అలకనంద తినలేదని తనకోసం వాళ్ళ నాన్న శంకర్ భోజనం తీసుకొని వస్తాడు. అన్నం తినమని అలకనందతో అంటాడు. నాకు వద్దు నాన్న.. నాకు బావ అంటే ఇష్టం లేదు.. నన్ను బావకి ఇచ్చి పెళ్లి చెయ్యడం వద్దని అలకనంద చెప్తుంది. అప్పుడే జానూ వచ్చి అక్క నీకు నచ్చినట్లే జరుగుతుంది.. ముందు అన్నం తిను అంటుంది. మీరు నన్ను తినేలా చెయ్యడానికి ఇలా చేస్తున్నారని అలకనంద అంటుంది. అదేం లేదు అక్క నీ మనసులో ఇంత బాధ ఉందని అర్ధం కాలేదు.. నిజం చెప్తున్నా బావకి ఇచ్చి పెళ్లి చెయ్యం సరేనా అని జానూ చెప్తుంది. మరి నీకేం కావాలో చెప్పు ఏం కావాలన్న ఇస్తానని శంకర్ చెప్తాడు.
నాన్న నాకు అమెరికా వెళ్లాలని ఉంది. NRI సంబంధాన్ని పెళ్లి చేసుకుంటానని నందు చెప్పగానే.. ఏంటే నీ గొంతెమ్మ కోరికలు బావతో పెళ్లి ఇష్టం లేదు అన్నావ్ అంతవరకు ఒకే కానీ అంత పెద్ద సంబంధం చూడడం అంటే మాములు విషయం కాదని శారద కోప్పడుతుంది. పర్లేదులే అక్క నీకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేస్తామని జాను అంటుంది. సరే అని చెప్పండి నాన్న తన సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు కదా అని జానూ అనగానే శంకర్ సరే అంటాడు. అక్కడ మీ అక్క, అల్లుడు ఎంత బాధ పడుతున్నారో అని శంకర్ తో పెద్దావిడ అంటుంది. మరొకవైపు సూర్యపై భువన కోపంగా ఉండి భోజనం చెయ్యదు. సూర్య భోజనం తీసుకొని వచ్చి తినిపిస్తుంటే అక్కడ నుంచి లేస్తుంది. నువ్వు భోజనం తింటేనే నేను తింటానని సూర్య అనగానే భువన భోజనం చేస్తుంది. ఇక నువ్వు కోరుకున్నట్లే ఉంటాను అమ్మ.. బిజినెస్ చూసుకుంటానని సూర్య చెప్తాడు.
ఆ తర్వాత మురళి బాధపడుతుంటే.. నువ్వు ఏం బాధపడకు మీ మావయ్య నందుని ఒప్పించి పెళ్లి చేస్తాడని మురళి వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడే శంకర్, జానూ వస్తారు. అదిగో మీ మావయ్య వస్తున్నాడు శుభావార్త చెప్తాడని మురళి వాళ్ళ అమ్మ సంతోషపడుతుంది. నందు ఒప్పుకోవడం లేదు అక్క అని శంకర్ చెప్పగానే మీ స్థాయికి సరిపోమా అని బాధపడుతుంది. ఏ మొహం పెట్టుకొని వచ్చావని ఆవిడ కోప్పడుతుంటే.. అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు అని మురళి అంటాడు. సారీ రా అని శంకర్ అంటాడు. నాకు పెద్దఅల్లుడు కొడుకులాగా అనుకున్నాను కానీ ఇలా అవుతుందనుకోలేదని శంకర్ అనగానే పర్లేదులే మావయ్య అని మురళి పాజిటివ్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
