Home

»

Tv News

మగాళ్లపై సమీరా స్పెషల్ రీసెర్చ్.. సుధీర్, ఇమ్మానుయేల్‌పై పంచులు!

Oct 9, 2026 10:17AM

సరిగమప నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్ లేటెస్ట్ ప్రోమో చూస్తే వామ్మో అనుకోకుండా ఉండరు. ఎందుకంటే కమెడియన్ ఇమ్మానుయేల్ టాప్ సింగర్ మనోతో కలిసి కచేరీని చేసి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. మనో ఒక గీతం పాడగా తర్వాత ఇమ్మానుయేల్ "నా పేరు నా పేరు టీటో.. నా చేతి మీదుంది టాటూ" అంటూ పాడేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత జడ్జెస్ గురించి పాడమని మనోని అడిగాడు ఇమ్మానుయేల్.

ఇక మనో "అనిల్ రావిపూడి " అంటూ ఎత్తుకున్నారు రాగం కానీ తర్వాత అంతా మర్చిపోయి ఎం పాడాలో తెలీక ఆయన పేరునే అటు తిప్పి ఇటు తిప్పి పాడి అలరించారు. ఇమ్మానుయేల్ ఐతే "మావయ్య నెక్స్ట్  ది నెక్స్ట్ ది " అన్నాడు కానీ మనో పట్టించుకోలేదు. "ఉండరా నెక్స్ట్ లైన్ గుర్తురావాలిగా అన్నారు " మనో. "గుర్తురాక ఇదంతా "అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత ఇమ్ము ఐతే "అట్లాంటోళ్లే ఇట్లాంటోళ్లే లోపలొకటి బయటికొకటి చెప్తారు" అంటూ పాడాడు. ఇక సమీరా అందుకుంది "అబ్బాయిలంటేనే అబద్దాలు అబద్దాలు అంటే అబ్బాయిలు. అందులో నీకేమన్నా డౌట్ ఉందా  " అంటూ అబ్బాయిల మీద రీసెర్చ్ చేసినట్టు చెప్పింది. వెంటనే సిమ్రాన్ "వాహ్ వా వాహ్ వా" అనేసింది.
"నేనింకా స్టార్ట్ చేయలేదు " అని సమీరా చెప్పేసరికి ఇమ్మానుయేల్ నవ్వాడు.

"అంతెందుకు వీళ్ళు ఐ లవ్ యు చెప్పేటప్పుడు చెప్పేది అబద్దాలే కదా. సుధీర్ గారు ఏమంటారు " అంది సమీరా. "నేనెప్పుడూ చెప్పను కాబట్టి " అన్నాడు. వెంటనే సిమ్రాన్ ఐతే "ఎందుకు మీరు అబ్బాయి కాదా " అనేసింది. దాంతో సుధీర్ షాకైపోయాడు. "మగాళ్లు వట్టి మాయగాళ్లే " అనే పాట పాడింది సమీరా. "సమీరా గారు చాలా బాగా చెప్పారు కానీ ఈ పాట రాసింది కూడా మగాడే " అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత సుధీర్ లేచి మనోకి ఇమ్మానుయేల్ కి మధ్యలో వెళ్లి కూర్చున్నాడు. వెంటనే ఆ కంబినేషన్ ని చూసిన "మాయగాళ్లు మోసగాళ్లంతా ఒక చోటికి చేరినట్టుంది " అనేసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com