Home

»

Tv News

డీమన్ పవన్ - రీతూ జోడికి దిష్టి కొట్టింది... ఏరా పనిపాట లేకుండా మా మీదా...

Oct 1, 2026 6:21PM

ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అండ్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది రీతూ - డీమన్ పవన్ విషయం. ఇప్పుడు ఈ సబ్జెక్టు బాగా వైరల్ అవుతోంది. అసలు డీమన్ పవన్ - రీతూ మధ్య ఏమయ్యింది అనే విషయం మీద ఎవరికీ వారు జడ్జ్మెంట్స్ పాస్ చేసేస్తున్నారు. ఐతే రీసెంట్ గా రీతూ చౌదరి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో అలాంటిది ఏమీ లేదు అంటూ పోస్ట్ చేసింది. ఇంతకు రీతూ ఎం పోస్ట్ చేసిందో చూస్తే ...

"అసలు ఫ్రెండ్ షిప్ లో 100 గొడవలుంటాయ్.  దానికి బ్రేకప్ ఏంటో. మేమేమైనా లవర్సా , లేకపోతే మాకు పెళ్ళని చెప్పామా. ఇదెక్కడి గోలరా నాయనా. దానికి సోషల్ మీడియాలో పని పాట లేకుండా వీడియోస్ పెట్టుకోవడం ఏంటో. దీనికి రివ్యూస్ ఏంటి. ఇంత ఖాళీగా ఉన్నారురా మీరు. కొంతమందైతే వ్లాగ్స్  కూడా. ఒరేయ్ మీ ఫ్రెండ్స్ తో మీకు గొడవలు అవ్వవా ? దేనికి రా నిబ్బాగాళ్ళు. వాడేదో పెట్టాడు. మీరేంట్రా ఇంత ఖాళీగా ఉన్నారు ఏంట్రా. ఏదేమైనా ఒక్క రోజులు 25 కే  మంది నన్ను ఫాలో అవుతున్నారు. "

అసలు ఒకసారి ఆలోచిస్తే బిగ్ బాస్ నుంచే వీళ్ళ జోడి గురించి ఆడియన్స్ కి తెలిసింది. ఇక బిగ్ బాస్ నుంచి మొదలైన జోడీలు ఏవీ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పుడు వీళ్లది కూడా అదే రూట్ లో వెళ్తోంది. అన్ని రకాల యాడ్స్ ని కలిసి చేశారు. కానీ ఇప్పుడు సడెన్ గా బ్రేకప్ అంటే ఏంటి అర్ధం అంటూ ఆడియన్స్ అడుగుతున్నారు. కలిసి షోస్ కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరికీ వాళ్ళు వస్తున్నారు. గత బిగ్ బాస్ సీజన్స్ ని ఒకసారి చూస్తే సిరి హన్మంత్ - షణ్ముఖ్ లవ్ ట్రాక్ అలాగే ఆగిపోయింది. మధ్యలో విష్ణు ప్రియా పృద్విని విపరీతంగా ప్రేమించేసింది. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ కలిసి కనిపించలేదు. ఇక ఇప్పుడు డీమన్ పవన్ - రీతూ జోడి అదే బ్రేకప్ రూట్ లో నడుస్తోంది. ఏదేమైనా బిగ్ బాస్ లో సక్సెస్ అయ్యే జోడీలకు మాత్రం గట్టిగానే దిష్టి కొడుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com