Home

»

Tv News

Illu illalu pillalu: భాగ్యం కుట్రలకు బలైపోయిన సాగర్.. ఉమ్మడి కుటుంబంలో చిచ్చు!

May 21, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-476 లో.. సాగర్ గొడవ చేస్తుంటాడు. ఏంటిది సాగర్ అని నర్మద అడుగుతుంది. నేను గొడవ పెట్టుకోవడం లేదు.. ఆయన అడిగిన డబ్బు ఆయనికి ఇచ్చేసి ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నానని సాగర్ అంటాడు. రేయ్ పెద్దోడా ఏంట్రా ఈ మాటలు ఉమ్మడి కుటుంబాన్ని వదిలి ఎక్కడికి వెళతావ్ రా.. తప్పురా అని వేదవతి అంటుంది. మరి అప్పుడు మీ ఆయన నన్ను కొట్టినప్పుడు ఎందుకు ఆపలేదని వేదవతితో సాగర్ అంటాడు. ఏంట్రా ఆ మాటలు నువ్వు ఇంట్లో ఉండటం కోసమే మీ నాన్న అలా చేశాడురా అది నీపై ప్రేమరా అని వేదవతి అనగానే ఆపమ్మా నా డ్రామాలు అని సాగర్ అంటాడు. ఇక వేదవతి సైలైంట్ అవుతుంది.

ఇక సాగర్ వెళ్ళిపోతానని మొండిపట్టు పడతాడు. దాంతో వెళ్ళిపోరా.. నీ భార్యని తీసుకొని వెళ్ళిపోరా అని రామరాజు అంటాడు. అదేంటండి మీరు కూడా అలానే అంటున్నారని వేదవతి అడుగుతుంది. ఏం చేయమంటావ్ మరి.. ఈ రోజు కాకపోయినా రేపైనా వెళ్ళిపోతాననే అంటాడు. వాడు ప్రతీసారి ఇలా బ్లాక్ మెయిల్ చేయడం ఎందుకు.. నేనే వెళ్ళిపోమంటున్నానని రామరాజు అంటాడు. దాంతో చెప్పారుగా.. వినపడిందిగా .. పదా వెళదామని నర్మదతో సాగర్ అంటాడు. ఇక సాగర్ వెనకాలే నర్మద వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది. మరోవైపు ప్రేమకి ధీరజ్ కార్ డ్రైవింగ్ నేర్పుస్తుంటాడు. తను ఫాస్ట్ గా కార్ నడుపుతుంటే ధీరజ్ భయపడుతుంటాడు. ఇప్పుడు నువ్వు కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం అవసరమా అని ధీరజ్ అనగానే మనకి డబ్బులు ఇచ్చిన అతను ఏం అన్నాడు..డబ్బులు టైమ్ కి ఇవ్వకపోతే కార్ తీసుకెళ్తానని చెప్పాడు కదా.. అందుకే నీకు బాలేనప్పుడు నేను నడుపుతాను..నువ్వు మధ్యాహ్నం టైమ్ లో అలసిపోయి ఇంటికి వచ్చి తిని పడుకుంటే నేను నడిపి సంపాదిస్తాను.. అప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదని ప్రేమ అంటుంది. నీకు బానే తెలుసే అని ధీరజ్ అంటాడు.

సాగర్ కి నర్మద ఫోన్ చేసి ఇంట్లో జరిగిందంతా చెప్తుంది. సరే వదిన వస్తున్నానని ధీరజ్ అంటాడు. ఇక వెంటనే ప్రేమని కార్ ఆపమని చెప్పి తను డ్రైవ్ చేస్తూ వస్తుంటాడు. మరోవైపు శ్రీవల్లి, ఆనందరావు, భాగ్యం అంతా కలిసి ఒక గదిలో ఆనందంగా మాట్లాడుకుంటారు. నువ్వు సూపర్ మమ్మీ .. దేవుడు మనలాంటి విలన్ ల పక్కనే ఉంటాడని మరోసారి చెప్పావని వల్లి అనగానే అయ్యో పిచ్చితల్లి.. అది దేవుడు చేసింది కాదు నీ తల్లి భాగ్యం చేసిందని భాగ్యం అంటుంది. దాంతో నాకేంటి అర్థమవ్వడం లేదని వల్లి అంటుంది. ఇక సాగర్ ని రెచ్చగొట్టడానికి నర్మద వాళ్ళ నాన్న ప్రసాదరావు దగ్గరికి వెళ్ళి లేనిపోనివి అన్నీ చెప్పినట్టు, అతన్ని రెచ్చగొట్టినట్టు భాగ్యం, అనందరావు చెప్తారు. అమ్మోయ్... నువ్వు కొంపలు కూల్చే కిలాడివి అని మరోసారి నిరూపించావే అంటూ ఆనందంగా చెప్తుంది వల్లి. భాగ్యం, ఆనందరావు, వల్లి అంతా ఫుల్ హ్యాపీగా ఉంటారు‌. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com