.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1069 లో..... అందరికి డబ్బు పంచావ్.. నాకు అనేసరికి డబ్బు లేవు అంటావేంటని రాజు డిస్సపాయింట్ అవుతాడు. అప్పుడే ఇందు తన బ్యాగ్ నుంచి డబ్బు తీసి రాజుకి ఇస్తుంది. రాజు డబ్బు లెక్కపెడుతూ ఇందు గమనించకుంటే ఇంకా కొంచెం డబ్బు తీసుకోవాలని అనుకుంటాడు కానీ ఇందు తన వంక చూస్తూ ఉంటుంది. అందులో ఎంత డబ్బు తక్కువ వచ్చిన అంత డబ్బు కట్ చేస్తానని ఇందు అనడంతో అమ్మో అని రాజు భయపడతాడు.
ఆ తర్వాత అన్నీపోగా రేఖ చేతికి ఇందు అయిదు లక్షలు ఇస్తుంది. అవి చూసి.. చూసావా డబ్బు రాగానే ఆ ఇందు ఎలా తోక జాడించిందోనని భ్రమరాంబ అంటుంది. అది ఎంప్లాయిస్ కి శాలరీ ఇచ్చి వాళ్లలో ఇంప్రెషన్ కొట్టేసినప్పుడే దాని తోక కత్తిరించాలని డిసైడ్ అయ్యానని రేఖ అంటుంది. ఆ తర్వాత రాజు, ఇందు ఇద్దరు శృతి దగ్గరికి వెళ్లి మంచి డిజైన్స్ వెయ్యండి అని ఇందు చెప్తుంటే మీ అమ్మ కూడా అలాగే డిజైన్ గురించి చెప్పేదని శృతి అంటుంది. కావ్య మేడమ్ వేసిన డిజైన్స్ అన్ని మీ టేబుల్ పై ఉన్న ల్యాప్ టాప్ లో ఉన్నాయి చూడండి అని శృతి అనగానే ఇందు వెళ్లి ఆ డిజైన్స్ చూస్తుంది. చాలా బాగున్నాయ్.. ఇవి కూడా హర్ష గారికి పంపిస్తే ఏం అంటారో ఒకసారి పంపిద్దామని ఇందు పంపిస్తుంది. అవి హర్ష చూసి ఇవి కావ్య మేడం గతంలో వేసిన డిజైన్ కదా.. అప్పుడు వీటికి అప్రూవల్ ఇచ్చాము.. మళ్ళీ ఇవేంటీ వేరే ట్రై చెయ్యండి అని హర్ష చెప్తాడు.
ఆ తర్వాత రేఖ దగ్గరికి ఐశ్వర్య వస్తుంది. ఆంటీ నాకొక లక్ష కావాలి అంటుంది. నువ్వు చేసిన పనికి లాగిపెట్టి కొట్టాలి కానీ ఆ ఇందు ముందు తక్కువ చెయ్యడం ఇష్టం లేక సైలెంట్ గా ఉన్నానని రేఖ కోప్పుడుతుంది. మరొకవైపు ఇందు డిజైన్స్ రెడీ అయ్యాయా లేదా అని శృతికి ఫోన్ చేస్తుంది. మేడం నాకు ఏ థాట్ రావడం లేదు.. కావ్య మేడమ్ ఉన్నప్పుడు సలహా ఇస్తుంటే వేసేదాన్ని అని శృతి అంటుంది. ఇప్పుడు కూడా నువ్వు వెయ్యగలవని శృతిని ఇందు మోటివేట్ చేస్తుంది. ఆ తర్వాత మనం కూడా డిజైన్స్ ట్రై చేద్దామని ఇందుతో రాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
