Home

»

Tv News

Illu illalu pillalu : సుకన్య ఎంట్రీతో కొత్త ట్విస్ట్.. ధీరజ్ పెళ్లి వెనుక అసలు నిజం బయటపడుతుందా?

May 09, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -466 లో.....నర్మద తీసుకొని వెళ్లిన రిపోర్ట్స్ చూసి ఖచ్చితంగా అబ్బాయి పుడతాడని వేదవతి, అమ్మాయి పుడుతుందని రామరాజు అనుకుంటారు. అప్పుడే వల్లి వస్తుంది. నువ్వు చెప్పు అమ్మాయిని కంటావా? అబ్బాయిని కంటావా అని  వల్లిని వేదవతి అడుగుతుంది. అసలు నాకు కడుపు ఉంటనే కదా అని వల్లి అనగానే అందరు షాక్ అవుతారు .అంటే నా చేతిలో ఏముందని అంటున్నానని వల్లి కవర్ చేస్తుంది.

అవును నీకేం తెలుసులే అని వేదవతి అంటుంది. అప్పుడే బయట ఎవరో వచ్చినట్లు అనిపిస్తే తిరుపతి బయటకు వెళ్తాడు. ఆటోలో నుండి ఒక అమ్మాయి దిగుతుంది. తనని చూసి తిరుపతి ఫ్లాట్  అవుతాడు. ఇదేనా రామరాజు గారి ఇల్లు అని తిరుపతిని ఆ  అమ్మాయి అడుగుతుంది. ఇదే అని తిరుపతి చెప్తాడు. నీ పేరు ఏంటని ఆ  అమ్మాయిని  తిరుపతి అడుగగా..  సుకన్య అని తను చెప్తుంది. నా పేరు తిరుపతి అని పరిచయం చేసుకుంటాడు. ఇంట్లోకి  వెళ్లి వల్లిని చూసి హగ్ చేసుకుంటుంది.  ఏంటే ఇలా వచ్చావని  వల్లి మెల్లగా అడుగుతుంది. భాగ్యం అత్త పంపించిందని సుకన్య చెప్తుంది. ఇంతకి  ఆ అమ్మాయి ఎవరు అమ్మ అని రామరాజు అడుగుతాడు. మా అమ్మ వాళ్ళ అన్న యొక్క  చిన్న కూతురు అని వల్లి చెప్తుంది. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చిందని నర్మద అడుగుతుంది. వల్లిని చూసుకోమని భాగ్యం అత్త పంపంచిందని సుకన్య  చెప్తుంది. సుకన్య పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది.

అప్పుడే ప్రేమని తీసుకొని భద్రవతి, సేనాపతి వస్తారు ఏమైందని రామరాజు అడుగుతాడు. నీ చిన్నకొడుకు నా మేనకోడలిని నగలు తాకట్టు పెట్టమని పంపాడని భద్రవతి అంటుంది. అదేం కాదు వాళ్ళకి ఏం తెలియదు.. ధీరజ్ ఇబ్బంది పడుతున్నాడని వాడికి తెలియకుండా ఇదంతా చేసానని ప్రేమ అంటుంది. అసలు వాడు నగలు, ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడని భద్రవతి అంటుంది. కాదు అసలు వాడు నన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడో తెలుసా అని ప్రేమ చెప్పబోతుంటే తనని  ధీరజ్ ఆపుతాడు. ఇప్పుడు వాళ్ళకి  తెలియాలి.. నిన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారని ధీరజ్ తో ప్రేమ అంటుంది. నిజం ఎలాగైనా ఈ రోజు చెప్పాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com