.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -469 లో...... సాగర్ ఇంట్లో నుండి బయటకు వచ్చేలా తన ఇంట్లో వాళ్ళు తన పట్ల పక్షపాతంగా ఉంటున్నారని సాగర్ తో శ్రీనివాసరావు చెప్తాడు. మీ తమ్ముడు చూడు నిన్ను అయిదు లక్షలు ఇచ్చి వెళ్ళమని అంటాడా.. అసలు నువ్వు అంటే ఇంట్లో ఎవరికి ఇష్టం లేదని శ్రీనివాసరావు అంటాడు. మరొకవైపు అబద్ధం అనుకుంటున్నా కడుపు నిజం చేయాలని చందు తాగబోయే పాలలో వల్లి, సుకన్య కలిపి ఏదో పౌడర్ కలుపుతారు.
ఈ పాలు తాగగానే మీ ఆయన నీ చుట్టూ కుక్కపిల్లలా తిరుగుతాడని సుకన్య అనగానే వల్లి సిగ్గుపడుతుంది. అప్పుడే వేదవతి వస్తుంది. ఏంటి ఇది అని ఆ పౌడర్ డబ్బాని చూసి అడుగుతుంది. బాదం పొడి అని వాళ్ళు అబద్ధం చెప్తారు. బావకి ఇష్టం కదా అందుకే పాలల్లో ఇది వేసామని వల్లి అనగానే బాదం పాలు ఇంట్లో అందరికి ఇష్టమే అని ఆ డబ్బాలోని పౌడర్ మొత్తం పాలల్లో కలిపి నాలుగు గ్లాసుల్లో పోస్తుంది వేదవతి. ఒక గ్లాస్ వల్లికి ఇచ్చి చందుకి ఇవ్వమంటుంది. మరో రెండు గ్లాసులు ప్రేమ, నర్మదలకి ఇస్తుంది. ఇంకొక గ్లాస్ రామరాజుకి తీసుకొని వెళ్తుంటే ఆకలిగా ఉందని మధ్యలో తిరుపతి తీసుకొని తాగుతాడు.
ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి ప్రేమ పాలు తీసుకొని వెళ్తుంది. నేను ఇందాకే మజ్జిగ తాగానని అనగానే ప్రేమ ఆ పాలు తాగుతుంది. మత్తుగా అనిపించి ధీరజ్ పక్కన పడుకొని తన ప్రేమ గురించి చెప్తుంది. మరొకవైపు సాగర్ ఆ పాలు తాగకపోతే నర్మద తాగుతుంది. తను కూడా మత్తులో ఉంటుంది. నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు సాగర్ అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మరొకవైపు చందు ఆ పాలు తాగి వల్లిని దగ్గరికి తీసుకుంటాడు. ఒక్క నిమిషం బావ అని వల్లి... సుకన్య దగ్గరికి వెళ్తుంది. నువ్వు ఇచ్చిన ఐడియా సూపర్, బావ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నాడని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
