
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -130 లో.... మహా తన వాళ్ళు చేసిన పనికి వాళ్ళని తిట్టి శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. అసలు ఇదంతా ముందే నాకు ఎందుకు చెప్పలేదని చక్రిని మహా ఆడుగుతుంది. వాళ్ళు మీ ముందు అల్లుడు అని.. మీరు లేకముందు డ్రైవర్ అని పిలుస్తున్నారని వాళ్ళు చేసిన అవమానం గురించి మహాతో చక్రి చెప్తాడు. నన్ను క్షమించండి అని మహా అంటుంది. ప్రతీసారి మీరు చెప్పింది చేసానని చక్రి చెప్తుంటే అవునని మహా అంటుంది.
ఆ తర్వాత హారిక తన కూతురిని తీసుకొని ఇంట్లో నుంచి బ్యాగ్ పట్టుకొని వెళ్తుంటే లలిత ఆపుతుంది. నేను ఇక ఈ ఇంట్లో ఉండను.. నా చదువు నా ఆత్మగౌరవం అంతా కోల్పోయి ఇంట్లో వంటమనిషిగా మిగిలిపోయాను కానీ మీరు మీ ఇంట్లో బిడ్డని మీ కూతురని మర్చిపోయారు.. తల్లి తన కూతురు కన్నప్రేమని మర్చిపోయింది.. అన్న చెల్లి ప్రేమని మర్చిపోయాడు. హంతకులున్న ఇంట్లో నేను ఉండలేనని హారిక అనగానే అందరు షాక్ అవుతారు. నీకు మాపై ఇలాంటి అభిప్రాయం ఉందని నాకు తెలియదు అమ్మ అని ప్రతాప్ అంటాడు. మీ కూతురు సర్టిఫికెట్స్ కాల్చేసిన రోజే నాలో కోపం మొదలైంది.. ఇలాంటి దుర్మార్గుల మధ్య నా కూతురిని పెంచనని హారిక అంటుంటే ప్లీజ్ అమ్మ ఇప్పటికే ఈ ఇంటి కూతురు వెళ్ళిపోయింది.. ఇక కోడలు కూడా పోతే ఎలా.. ఈ ఇంటిని చీకటి చెయ్యొద్దు.. మహా ఇంకా చక్రి వాళ్ళ గురించి పట్టించుకోమని ప్రతాప్ రిక్వెస్ట్ చేస్తాడు. లలిత కూడా రిక్వెస్ట్ చేస్తుంది. నా పాపని నాకు ఇచ్చి వెళ్ళు అని ఆది అంటుంటే ప్రతాప్ తన చెంపచెల్లుమనిపిస్తాడు. సారీ చెప్పు అని ప్రతాప్ చెప్పగానే ఆది సారీ చెప్పి లోపలికి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు మహాని చూసి నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఆ తర్వాత కన్నాకి ఫీవర్ వస్తుంది. నేను అమ్మలాగా చూసుకుంటాను. మీరు మీ పనికి వెళ్ళండి మాధవతో మహా అంటుంది. చక్రిని కూడా అక్కడ నుంచి వెళ్ళమని చెప్తుంది. ఆ తర్వాత కేశవ దగ్గరికి శైలు వస్తుంది. ఇది మీ ఇల్లా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావని శైలు అడుగుతుంది. దాంతో శైలు చెంప చెల్లుమనిపిస్తాడు కేశవ. నీకు ఒకసారి కట్ చేస్తే వాళ్ళు ఏ సిచువేషన్ లో ఉన్నారో అర్థం చేసుకోవా అని కోప్పడతాడు. దాంతో శైలు బాధపడుతుంది. తరువాయి భాగంలో చక్రి కోసం మహా వెయిట్ చేస్తుంది. తనలో మార్పు వచ్చిందిరా నీకోసం వెయిట్ చేస్తుంది.. తను నిన్ను ప్రేమిస్తున్నట్లు ఉందని చక్రితో కేశవ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
