Home

»

Tv News

Podharillu :జమునకు నారాయణ వార్నింగ్.. ఇల్లు దోచేయాలని ప్లాన్!

Oct 14, 2026 10:16AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -234 లో..... జమున ఇంట్లో అన్ని పనులు చేస్తూ అందరిని  నమ్మిస్తుంటుంది కానీ నారాయణ మాత్రం ఆమెను నమ్మడు. ఉదయం అన్నదమ్ములు నిద్రలేచే సరికి జమున లేచి ఇంట్లో పనులన్నీ చేసేస్తుంది. మాధవ్ ను వంటగదికి రానివ్వకుండా వంట కూడా పూర్తి చేసి క్యారేజీలు కట్టి రెడీ చేస్తుంది. ఎందుకమ్మా ఇవన్నీ చేస్తున్నావని మాధవ్ అడిగితే వీడిని చిన్నప్పుడు వదిలేసి వెళ్తే నువ్వు ఇంతటి వాడిని చేశావ్ ఆ పాపం కాస్త ఈ పనులు చేసి కడిగేసుకుంటానని అంటుంది. కన్నాను ఇంట్లోనే ఉండమని కేశవ్ అనగా వాడికి పరీక్షలు ఉన్నాయని మహా చెప్తుంది . దీంతో కన్నా వాళ్ల అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు.

 

 ఎప్పుడూ మాధవ్ దగ్గర తీసుకునే కన్నా ఈసారి అమ్మ ఆశీర్వాదం తీసుకోవడంతో మాధవ్ కొంచెం ఫీలవుతాడు. వెంటనే మహా గుర్తు చేయడంతో మాధవ్ ఆశీర్వాదం కూడా తీసుకుని బయటకు వస్తాడు. మనం వెళ్లిపోతే నాన్న ఆమెను ఏమైనా చేస్తాడేమోనని మాధవ్ భయపడగా ఏం పర్వాలేదని, మనం లేకపోతేనే వాళ్ల మధ్య సమస్యను వాళ్లే పరిష్కరించుకుంటారని మహా చెప్పి అందరిని  తీసుకుని వెళ్లిపోతుంది. ఇంట్లో అందరు  వెళ్లిపోవడంతో జమునను  నారాయణ  పిలిచి మళ్లీ ఎందుకు వచ్చావని అడుగుతాడు. కన్నా కోసం వచ్చానని చెప్పగా నీకు సిగ్గు శరం ఉందా అని తిడతాడు. నువ్వు ఎలాంటిదానివో వాళ్లకు తెలియకపోయినా నాకు తెలుసు కదా అని అంటాడు.ఇప్పుడిప్పుడే ఈ బృందావనానికి ఉన్న శాపం పోయిందని మళ్లీ వచ్చి చెడగొట్టవద్దని హెచ్చరిస్తాడు. నేను ఆశ్రయం కోసం, అన్న కోసం, కొడుకు ప్రేమ కోసం వచ్చానని జమున చెప్తుంది .నేను నా భార్యను చంపానని అందరు  అనుకుంటున్నారని నిన్ను చంపేసినా కొత్తగా వచ్చే చెడ్డపేరు ఏమీ లేదని కానీ కొడుకులకు పెళ్లిళ్లు కాబోతున్నాయని ఊరుకుంటున్నానని మర్యాదగా వెళ్లిపొమ్మని హెచ్చరిస్తాడు. అయినా జమున లెక్కచేయకుండా లోపలికి వెళ్లిపోతుంది.

 

ఆ తర్వాత జమునకు ఆమె భర్త ఫోన్ చేసి ఇంట్లో ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తాడు. ఇది మన ఇంటికన్నా దరిద్రపు కొంపలా ఉందని జమున అంటుంది. ఏమైనా ఉంటే మొత్తం ఊడ్చేసుకుని రమ్మని అతను అంటాడు. ఇంట్లో నలుగురు సంపాదిస్తున్నారని ఖచ్చితంగా పెద్ద మొత్తంలో దాచే ఉంటారని అవి దొరకగానే వచ్చేస్తానని జమున  చెప్తుంది .ఇంట్లో ఎవరూ లేరని ఇల్లంతా వెతుకుతుంది, చిల్లర డబ్బులు తప్ప ఏమీ కనిపించకపోయేసరికి ఉసూరుమంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com