Home

»

Tv News

Podarillu: జయంతి తమ్ముడు శశిపాల్ ఎంట్రీ.. నారాయణ ఫ్యామిలీని అవమానించాడుగా!

Sep 11, 2026 11:35AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -206 లో.....జయంతి తమ్ముడు శశిపాల్ ఎంట్రీతో రచ్చ మొదలైంది. మాధవ ఇంటికి కొత్త డ్రెస్ పట్టుకుని శశిపాల్ వస్తాడు. ఇల్లంతా చూసి.. ఇదేంటి ఇలా ఉంది. దీన్ని ఇల్లు అంటారా? కనీసం సున్నం కొట్టించుకునే డబ్బులు కూడా లేవా.. ఫర్నీచర్ కూడా లేదంటూ అవమానిస్తాడు. దీంతో చక్రి.. ఇల్లు ఎలా ఉంటే నీకేంటి, నువ్వు కూడా కాపురానికి వస్తావా అని స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు.

శశిపాల్ ను చూసి చక్రి, కేశవ.. ఎవడు వీడు.. అనగానే జయంతి తమ్ముడు అని పెద్ది చెప్తాడు. ఓహో కొత్త బామ్మర్దా అంటూ చక్రి సెటైర్ వేస్తాడు. తన పేరు శశిపాల్ అంటే శిశుపాలుడా? కృష్ణుడు తల నరికేస్తాడంటూ చక్రి, కేశవ పంచ్ లు వేస్తారు. మాధవ వేసుకున్న డ్రెస్ ని తక్కువ చేసి.. మా అక్క పంపిన కొత్త డ్రెస్సే వేసుకోవాలి లేదంటే ఎంగేజ్మెంట్ ఆపేసి రోడ్డు మీద ధర్నా చేస్తుందని బెదిరించి వెళ్లిపోతాడు శశిపాల్. జయంతి ఫోన్ చేసి అదే డ్రెస్ మ్యాచింగ్ గా వేసుకోమని చెప్పడంతో పెద్ది తప్పక ఒప్పుకుంటాడు. మరోవైపు చక్రి, మహా డ్రెస్ కి మ్యాచింగ్ వేసుకోవాలని కేశవ షర్ట్ తీసుకుంటే, చివర్లో మహా డ్రెస్ మార్చడంతో చక్రి షాక్ అవుతాడు. ఇంట్లో జరిగిందంతా శశిపాల్ జయంతికి చేరవేసి.. ఆ ఇల్లు అలా ఉంది.. మనుషులు నలుగురిని మర్డర్ చేసినట్లు ఉన్నారు.. నీకు వీళ్లు అవసరమా అని అంటాడు. దానికి జయంతి.. వేరు కాపురం పెట్టిస్తానని చెప్తుంది.

జయంతి తండ్రి.. ఇంకోసారి ఆలోచించు, శేఖర్ మంచోడు, ఫ్యామిలీ అంటా అని సలహా ఇస్తే..  జయంతి తల్లి.. దానికి ఏం చేయాలో తెలుసు, భర్త చెప్పినట్లు ఎవరు వింటున్నారని భర్తను తిడుతుంది. చివర్లో నారాయణ ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ కి కారులో దిగగా కనీసం పలకరింపు కూడా లేకపోవడంతో..‌ఏంట్రా ఇవేనా మర్యాదలు అంటూ నారాయణ ఫైర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com