Home

»

Tv News

హలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారా!

May 11, 2026

సోషల్ మీడియాలో నిఖిల్ విజయేంద్ర సింహ అంటే తెలియని వాళ్ళు లేరు.  కంటెంట్ క్రియేటర్ గా యూట్యూబ్ ఇన్ఫ్లూఎన్సర్ గా ఉన్నాడు. అలాంటి నిఖిల్ ఇప్పుడు కూకు విత్ జాతిరత్నాలు షోలో కంటెస్టెంట్ గా చేస్తున్నాడు. ఐతే రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టాడు. అది కూడా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ తన కండలు చూపిస్తూ. "ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ..ఉన్నారా ఎవరైనా ?" అంటూ కొటేషన్ పెట్టాడు. దాంతో నెటిజన్స్ అంతా రెస్పాండ్ అయ్యారు. "అన్నా నీకు ఎవరైనా వస్తారు. నరాలు బాగా కనిపిస్తున్నాయి.

నీకు ఉన్నారుగా గర్ల్ ఫ్రెండ్, మళ్ళీ ఎవరైనా ఉన్నారా అని ఎందుకు, పెళ్లి కి కావాల్సింది కండలు కాదు బ్రదర్.. వచ్చిన వాళ్ళ నీ ఏ బాధలు లేకుండా జీవితంలో హ్యాపీగా చూసుకుంటా అనే భరోసా... ట్రైసెప్స్ ఇంకా చెయ్యాలమ్మా బైసెప్స్ మీద ఉన్న కాన్సంట్రేషన్ ట్రైసెప్స్ మీద కూడా పెట్టాలి. బాడీ చుపిస్తే రారు బ్రో బ్రెయిన్ వాడి ప్రొపోజ్ చెయ్యి  పక్కా వస్తారు. " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిఖిల్ తో ముచ్చట్లు అనే టాక్ షోతో చాలామందిని ఇంటర్వ్యూస్ చేసాడు. హాయ్ నాన్న మూవీ డైరెక్టర్ శౌర్య తమ్ముడే ఈ నిఖిల్.  కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో కూడా నిఖిల్ చేసాడు.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com