.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -108 లో..... ఇంట్లో అందరు డిస్టబ్ అయ్యారని మహా రెసాట్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అందరు రెసాట్ కి బయల్దేరి వెళ్తారు. మరొకవైపు ప్రతాప్ తన కుటుంబంతో అదే రెసాట్ లో ఉంటాడు. మహాని గుర్తుచేసుకొని బాధపడుతాడు. ఏంటండి ఇంట్లో ఉంటే అదే ఆలోచిస్తున్నారని ఇక్కడికి తీసుకొని వస్తే ఇక్కడ కూడా అదే ఆలోచిస్తున్నారని లలిత అంటుంది.అది పుట్టలేదు అనుకోండి నాన్న.. మర్చిపోండి అని ప్రతాప్ తో ఆదిత్య అంటాడు.
మరొకవైపు మహా వాళ్ళు రెసాట్ లోపలికి వస్తారు. ఇక్కడ అందరం ఒక ఫోటో దిగుదామని మహా అంటుంది. ఆ తర్వాత అందరికి కలిసి ఒక రూమ్.. చక్రి, మహా ఒక రూమ్ తీసుకుంటారు. అందుకు మహా ఆధార్ కార్డు కావాలని చక్రి అంటాడు. ఆధార్ కార్డు లేకపోవడంతో చక్రి, మహా ఫోటో తీసుకొని వాళ్ళకి చూపిస్తే భార్యాభర్తలు అని నమ్ముతారని చక్రి అంటాడు. దాంతో ఇద్దరు కలిసి ఒక ఫోటో తీసుకుంటారు. దాంతో చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మహా వాళ్ళు ఒక టేబుల్ పై భోజనం చేస్తారు. మరొకవైపు కొద్దీ దూరం లో ప్రతాప్ వాళ్ళు భోజనం చేస్తారు. నాకు ఆకలి లేదు డ్రింక్ చెయ్యాలని ఉందని నారాయణ వెళ్తాడు. అప్పుడే రెసాట్ లో మందు కోసం ప్రతాప్ వెళ్తాడు. మందు లేదని అక్కడ వాళ్ళు చెప్తారు. అక్కడే ఉన్న నారాయణ.. ప్రతాప్ ని పిలిచి నా దగ్గర ఒక బాటిల్ ఉంది.. మనం ఇద్దరం షేర్ చేసుకుందామని అంటాడు. దాంతో ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు. ఇద్దరికి ఒకరికొకరు తెలియదు.. దాంతో ప్రతాప్ తన బాధని నారాయణకి చెప్తాడు. అంత ప్రేమగా పెంచానని అంటున్నారు.. నచ్చినవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండేదని నారాయణ అంటాడు. ఆ తర్వాత కాసేపటికి దూరం నుండి ఆదిత్య పిలుస్తున్నాడని ప్రతాప్ వెళ్తాడు.
ఆ తర్వాత ఎవరు నాన్న అతను అని ఆదిత్య అడుగుతాడు. ఎవరో తెలియదు బాగా మాట్లాడుతున్నాడని ప్రతాప్ అంటాడు. ఆ తర్వాత చక్రి, మహా మాట్లాడుకుంటారు. తరువాయి భాగంలో మళ్ళీ నారాయణ, ప్రతాప్ కలిసి డ్రింక్ చేస్తారు. ఇద్దరు ఒక ఫోటో తీసుకుంటారు. నా ఫోన్ చిన్నది.. ఆ ఫోటోని నా కోడలికి పంపండి అని నారాయణ అనగానే.. మహా ఫోన్ కి పంపిస్తాడు ప్రతాప్. ఆ ఫోటో చూసి మహా షాక్ అవుతుంది. మా నాన్న, మీ నాన్న కలిసి డ్రింక్ చేస్తున్నారని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
