Home

»

Tv News

Godhavari : నందుకు మురళి రాసిన లవ్ లెటర్ రచ్చ.. పెళ్లిచూపుల్లో ఊహించని ట్విస్ట్!

May 26, 2026 10:47AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -13 లో......నందుకి మురళి లవ్ లెటర్ రాస్తాడు. ఆ లెటర్ నేను నందుకి ఇస్తానని సూర్య అంటాడు. దానికి మురళి సరే అంటాడు. సూర్య లెటర్ తీసుకొని శంకర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ నందు ఉంటుంది. తనకి సైగ చేస్తాడు. పట్టించుకోకపోవడంతో అప్పుడే స్కూల్ నుంచి వస్తున్న కిన్నెరకి లెటర్ ఇచ్చి.. ఇది మీ నందు అక్కకి ఇవ్వమని చెప్తాడు. దాంతో కిన్నెరా వెళ్లి ఆ లెటర్ నందుకి ఇస్తుంది. ఈ లెటర్ ఎవరు ఇచ్చారని నందు అడుగుతుంది. బయటున్నాడు ఒకతను అని కిన్నెరా చెప్తుంది. సరే అతన్ని తీసుకొని లోపలకి రా అని నందు చెప్తుంది. నందు ఆ లెటర్ తీసుకొని వెళ్లి ఈ లవ్ లెటర్ గౌతమ్ కి అనుకుంటా ..ఎవరో ఇచ్చారు కిన్నెరా అతన్ని లోపలికి తీసుకొని వస్తుందని నందు చెప్తుంది.

అప్పుడే సూర్యని తీసుకొని కిన్నెర లోపలకీ వస్తుంది. సూర్యని చూసి సింహాద్రి మేనల్లుడు అని గుర్తు పడుతారు. మా గౌతమికి ఎందుకు లెటర్ రాసావని అడుగుతారు. అయ్యో తనకి కాదు లెటర్ అని సూర్య అంటాడు. అంటే మా జానూ కా అని నందు అడుగుతుంది. లేదని సూర్య అంటాడు. అంటే నాకా.. నాకు ఆల్రెడీ NRI సంబంధం వచ్చిందని నందు అంటుంది. ముందు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పండి.. మొన్న పెంపకం గురించి మాట్లాడింది కదా అని జానూ అంటుంది. సింహాద్రికి శంకర్ ఫోన్ చేయబోతుంటే అప్పుడే మురళి వచ్చి.. ఆ లెటర్ ని నందుకి ఇవ్వమని నేనే పంపించానని చెప్తాడు. దాంతో మురళిని శంకర్ బయటకు తీసుకొని వెళ్లి అసలు విషయం చెప్తాడు. ఆ తర్వాత నా మనవడికి ఇచ్చి చెయ్యడం లేదు.. నేను ఈ ఇంట్లో ఉండనని ఇంటి పెద్దావిడ బయటకు వెళ్తుంటే.. నువ్వు ఇంట్లో నుంచి వెళ్తే నా మీద ఒట్టే అని మురళి అంటాడు.

ఆ తర్వాత జశ్వంత్ తో గౌతమి ఫోన్ మాట్లాడుతుంది. అప్పుడే నందు వచ్చి.. ఫోన్ లాక్కొని ఎవరితో మాట్లాడుతున్నావ్ జశ్వంత్ తోనా అంటుంది. అవును అక్క కాలేజీకీ వెళ్లడం లేదు కదా అందుకే ఫోన్ చేసి ఏం జరిగిందో కనుకుంటున్నానని గౌతమి అంటుంది. ఆ తర్వాత మరుసటిరోజు పెళ్లిచూపులకి అబ్బాయి వాళ్ళు వస్తారు. అబ్బాయి రాలేదని శంకర్ అడుగుతాడు. ఈ ఊళ్ళో అబ్బాయికి ఫ్రెండ్ ఉన్నాడు.. తనతో వస్తానని అన్నాడని అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com