Home

»

Tv News

Podharillu : శైలు ప్రాణాలు కాపాడిన కేశవ.. మహా సర్టిఫికెట్స్ కోసం చక్రి ఫైట్!

May 19, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -116 లో.. నిద్రపోతున్న చక్రిని మహా బయటకు తీసుకొని వెళ్తుంది. మా వదిన నీతో వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది చెప్పమని మహా అడుగుతుంది. ఏం చెప్పిందో ఏంటో తెలుసుకోవాలని నాకు నిద్ర పట్టడం లేదని మహా అంటుంది. తన ఫ్రెండ్ దగ్గరికి నిన్ను పంపించామని చెప్పిందంటే వెళ్తుందేమోనని చక్రి అనుకుంటాడు.

ఏం లేదండి.. మీరు మీ ఇంట్లో చాలా గారాబంగా పెరిగారంట.. మిమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకోమని చెప్పిందని చక్రి చెప్తాడు. అంతేనా అని మహా అడుగుతుంది. మరొకవైపు శైలుని నలుగురు యువకులు అత్యాచారం చేయబోతుంటే.. కేశవ వచ్చి వాళ్ళని కొడుతాడు. అప్పుడే పోలీసులు వస్తారు. ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో పడొద్దు అమ్మా.. జాగ్రత్తగా ఉండాలని శైలుకి ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. ఈ అబ్బాయి నిన్ను సేవ్ చేసాడు.. తనకి థాంక్స్ చెప్పమని శైలుతో ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. కానీ మత్తులో ఉన్న శైలుకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత బలవంతంగా శైలు ని ఎక్కించుకొని తీసుకొని వెళ్లి కీర్తికి అప్పగిస్తాడు కేశవ. శైలు మత్తు వదలగొట్టి తనకి జరిగింది మొత్తం చెప్తుంది కీర్తి.

ఆ తర్వాత మహా వాష్ రూమ్ సరిగ్గా లేక ఇబ్బందిపడుతుంది అనుకొని తనకోసం ఒక వాష్ రూమ్ కట్టాలని అందరు నిర్ణయం తీసుకుంటారు. అందుకోసం కన్నా తను దాచుకున్న పాకెట్ మనీ ఇస్తాడు. వద్దని అంటున్నా కన్నా ఇస్తాడు. అప్పుడే మహా వస్తుంది. ఏంటి ఇక్కడున్నారని‌ మహా అడుగుతుంది. నీ కోసం వాష్ రూమ్ కడుతున్నామని చక్రి చెప్తాడు. అవునా.. ఈ రోజు ఇంటర్వ్యూ ఉందని మహా అంటుంది. ఒరేయ్ అమ్మాయిని నువ్వే తీసుకొని వెళ్ళు అని చక్రికి మాధవ చెప్తాడు. మహాని చక్రి ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్తాడు. తరువాయి భాగంలో అదే ఇంటర్వ్యూ దగ్గరికి భూషణ్ వెళ్తాడు‌. అక్కడ మహాని చూసి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో ఇంటర్వ్యూ ఛైర్ లో  భూషణ్ కూర్చొని ఉంటాడు. తన మొహం కనిపించకుండా కవర్ చేసుకొని మహా సర్టిఫికెట్స్ మొత్తం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్తాడు. భూషణ్ మొహం చూసి మహా షాక్ అవుతుంది. ఆ విషయం చక్రికి వెళ్లి చెప్తుంది మహా. నా సర్టిఫికెట్స్ నాకు కావాలని మహా అనగానే తనని తీసుకొని భూషణ్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com