.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -115 లో.... మహా వాళ్ళ వదిన హరిక తనని చూడాలని వస్తుంది. రాగానే ఇల్లు చూసి చిరాకుగా ఫీల్ అవుతుంది. ఎలా ఉండేది మహా ఇలా ఉంటుందని హారిక అనుకుంటుంది. మహాతో పాటు చక్రి, కన్నా ఉంటాడు. హారిక లోపలికి వెళ్లి వాష్ రూమ్ ఎక్కడ అంటుంది.. అక్కడ వాతావరణం చూసి వెనక్కి వస్తుంది. మహా నీతో మాట్లాడాలని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఎలా ఉంటున్నావ్ మహా నాకూ కొద్దీ సేపటికే చిరాకుగా ఉందని హారిక అంటుంది. నువ్వు వాళ్ళలాగే గోడలని చూస్తున్నావ్.. మనుషులని చూడు వదిన అని హారిక అంటుంది.
నువ్వు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండమని హారిక సలహా ఇస్తుంది. అప్పుడే మాధవ ఇంటికి మొదటిసారి వచ్చిందని తను తినడానికి సమోసా తీసుకొని వస్తాడు. తన ముందు పెట్టి వెళ్ళిపోతాడు. తను తీసుకొని వచ్చినవి తినడానికి కూడా హారిక ఇష్టపడదు.. ఇన్ని ఇబ్బందులుపడుతూ ఇక్కడ అవసరమా అని హారిక అనగానే ఆ టాపిక్ గురించి మాట్లాడకు వదిన అని మహా అంటుంది. మరొకవైపు శైలు తన ఫ్రెండ్ కీర్తిని కలిసి తనకి వచ్చిన రీల్ ప్రమోషన్ ని కేశవ కాన్సిల్ అయ్యేలా చేసాడు.. పాపం వాళ్ళు నన్ను కొలాబరేట్ కోసం పిలిస్తే తప్పుగా అపార్థం చేసుకొని కొట్టాడు.. అందుకే వాళ్ళకి సారీ చెప్పి కొలాబరేట్ కోసం పిలిచాను అడ్రెస్ పంపిస్తాను అన్నారని శైలు చెప్తుంది. అప్పుడే వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఒక్కదానివే రమ్మని అంటారు. దాంతో శైలు సరే అంటుంది. వాళ్ళు ఏదో తేడాగా ఉన్నారే వద్దు వెళ్లొద్దని కీర్తి చెప్తుంది.. అయినా శైలు వినదు. ఆ తర్వాత హారిక వెళ్లిపోతు చక్రిని పక్కకి పిలిచి మీరు నిజంగా పెళ్లి చేసుకోలేదని తెలుసు త్వరగా మహాని నా ఫ్రెండ్ దగ్గర ఉండడానికి ఒప్పించమని హారిక చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు వాళ్ళు చెప్పిన గెస్ట్ హౌస్ కి శైలు వెళ్తుంది. ఆ తర్వాత కేశవ దగ్గరికి కీర్తి వెళ్లి మొన్న మా ఫ్రెండ్ కీ హెల్ప్ చేసావ్ కదా అన్నా.. అదొక తింగరి ది మళ్ళీ వాళ్ళతో కొలాబరేట్ అవ్వడానికి వెళ్ళిందని కీర్తి చెప్పగానే నాకేం అవసరమని కేశవ అంటాడు.
ఆ తర్వాత వాళ్ళ వదిన నిన్ను పక్కకి తీసుకొని వెళ్లి ఏం చెప్పింది అని మాధవ అడుగుతాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళింట్లో మహాని దింపేయ్యమని చెప్పిందని చక్రి చెప్పగానే అందరు షాక్ అవుతారు. నా తర్వాత ఏదో మాటలో పడి కేశవతో బుస్ అని చక్రి అంటాడు. సడెన్ గా శైలు గుర్తువచ్చి తను ప్రాబ్లమ్ లో ఉందని అని కేశవ అక్కడ నుంచి వెళ్తాడు. మరొకవైపు శైలుకి జ్యూస్ లో ఏదో కలుపుతారు. అది శైలు తాగి మత్తులో నేను వెళ్ళిపోతానని అంటుంది. ఎక్కడికి వెళ్ళేది అని శైలుని బెడ్ పైకి తోసేస్తారు. మరొకవైపు వాళ్ళ వదిన వచ్చింది మాట్లాడింది మహా గుర్తు చేసుకుంటుంది.. నిద్రపోతున్న చక్రిని మహా లేపుతుంది. తరువాయి భాగంలో మహా ఇంటర్వ్యూకి వెళ్తుంది అక్కడ భూషణ్ తనని చూసి తన ఫ్రెండ్ తో ఇంటర్వ్యూ నేనే కండక్ట్ చేస్తానని చెప్తాడు. నన్నే రిజెక్ట్ చేస్తావా.. నీ సంగతి చెప్తానని భూషణ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
