.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -775 లో.....సూరజ్ జ్యోత్స్నను మోసం చేయడానికి కార్తీక్, దీపలే కారణమని పగతో రగిలిపోయిన శివన్నారాయణ, దీపను CEO పోస్ట్ నుండి తప్పించేందుకు 10 కోట్ల చెక్ తో కార్తీక్ ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ దక్షిణామూర్తి ఉంటాడు.
దక్షిణామూర్తిని చూసి కార్తీక్, దీప షాక్ అవుతారు.. అదృష్టం అంటే నీదేరా కార్తీక్, నేను ఎవరితో సంధి చేయమని వచ్చానో అతనే ఇక్కడికి వచ్చాడంటూ దక్షిణామూర్తి బయటకు వెళ్లిపోతాడు. నేను వచ్చింది బంధాలు పెంచుకోవడానికి కాదు, తెంచుకోవడానికి అంటూ దీపకు 10 కోట్ల చెక్ ఇచ్చి CEO పదవికి రాజీనామా పేపర్లపై సంతకం పెట్టమంటాడు. దీప క్షణం ఆలోచించకుండా సంతకం పెట్టగా.. కార్తీక్ ఆ చెక్ ను తీసుకుని.. మాకు అవసరం లేదంటూ చింపేస్తాడు.బయటకు వచ్చిన శివన్నారాయణకు దక్షిణామూర్తి, సూరజ్ ఎదురవుతారు. నా కొడుకు విషయంలో తప్పుకి నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పు అని దక్షిణామూర్తి అనడంతో శివన్నారాయణ రెచ్చిపోతాడు. ఏమనుకుంటున్నావ్ రా నన్ను అంటూ ఇద్దరూ గల్లా పట్టుకుని చొక్కాలు చిరిగేలా కొట్టుకుంటారు. దక్షిణామూర్తి బట్టలు శివన్నారాయణ చింపి.. క్షమాపణ ఎలా ఉంది, తల దించుకోమన్నావ్ కదా నిన్ను తల ఎత్తుకోకుండా చేశానంటూ అవమానిస్తాడు.
సూరజ్ ముందుకు దూసుకురాగా కార్తీక్ అడ్డుకుని.. మా ఇంటి ముందు కొట్టుకోవద్దు, తాతను తీసుకుని వెళ్లిపో సూరజ్ అని దండం పెడతాడు. శివన్నారాయణ వెళ్తూ.. మీ మధ్యవర్తిత్వం బాగా పనిచేసింది.. మీరిద్దరూ ఒక్కటే అని అర్థమైంది, నేను చేసిన అవమానం ఫోటో తీసి పెట్టుకోమంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇది ఇక్కడితో ఆపను అంటూ సూరజ్ తాతను తీసుకుని వెళ్లడంతో కార్తీక్, దీప బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
