స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -666 లో......దీప, కార్తీక్ వెళ్తుంటే సూరజ్ కన్పిస్తాడు. ఒక స్టాల్ పెట్టుకొని హెల్తీ ఫుడ్ సేల్ చేస్తాడు. అతని దగ్గరికి కార్తీక్ , దీప వచ్చి మాట్లాడతారు. ఇతనే మొన్న నాన్నని సేవ్ చేసిందని కార్తీక్ చెప్పగానే థాంక్స్ అని దీప చెప్తుంది. అయ్యో సాయం చేసే అవకాశం వచ్చింది దానికి మీరు థాంక్స్ చెప్పడం ఎందుకని సూరజ్ అంటాడు. మీరు సత్యరాజ్ రెస్టారెంట్ సీఈఓ కదా ఇంత సింపుల్ గా ఉన్నారని సూరజ్ అడుగుతాడు. మొన్న కలిసినప్పుడు ఈ విషయం అడగలేదని కార్తీక్ అంటాడు. ఇంటికి వెళ్ళాక గుర్తువచ్చిందని సూరజ్ చెప్తాడు.
అప్పుడు సీఈఓ.. ఇప్పుడు డ్రైవర్ కొన్ని పరిస్థితులకి తల వంచాల్సి వచ్చిందని కార్తీక్ అంటాడు. నువ్వు ఏంటి ఇలా స్టాల్ పెట్టుకున్నావని కార్తీక్ అడుగుతాడు. నేను ఒకటి అనుకున్నాను అది జరగలేదు.. అందుకే ఇది.. మీరు జ్యూస్ తాగి ఎలా ఉందో చెప్పండి అని సూరజ్ వాళ్ళకి జ్యూస్ ఇస్తాడు. పెళ్లి అయిందా అని కార్తీక్ అడుగుతాడు. మనసుకి నచ్చిన అమ్మాయి దొరకడం లేదని సూరజ్ అంటాడు. మళ్ళీ కలుద్దామని దీప, కార్తీక్ వాళ్ళు అక్కడ నుండి వెళ్తారు. మరొకవైపు స్వప్న నేను చెప్పింది ఏం చేసావని కాశీ అడుగుతాడు. నువ్వు పరిస్థితి మంచిగా నీకు అనుగుణంగా మార్చుకుంటావని స్వప్న అంటుంది. అల్లుడు ఏం తప్పు మాట్లాడలేదు.. మీ నాన్న గురించి అలోచించి కలిసి ఉందామని అన్నాడని కావేరి అంటుంది. నాన్న చనిపోయినా నేను తనతో కలిసి ఉండనని స్వప్న అనగానే కావేరి తన చెంపచెల్లుమనిపిస్తుంది. అప్పుడే శ్రీధర్ వచ్చి అంత విన్నాను అంటాడు. సారీ డాడీ అని స్వప్న చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ ని శ్రీధర్ ఇంటికి రప్పిస్తాడు. వాళ్ళ ఇద్దరి సమస్యకి పరిష్కారం దొరకాలని శ్రీధర్ అంటాడు.
ఇదే ఫ్యామిలీ కోర్ట్ అనుకో.. నువ్వు జడ్జ్ అనుకో.. ఇప్పుడు వీళ్ళకి తీర్పు చెప్పమని కార్తీక్ ని శ్రీధర్ అడుగుతాడు.. స్వప్నకి కార్తీక్ నచ్చజెప్తాడు. ఇప్పుడు మీరు కలిసి ఉంటారా.. ఈ ఇంట్లో నుండి నాన్న, పిన్నిని తీసుకొని వెళ్ళమంటారా అని కార్తీక్ అడుగుతాడు. దాంతో కాశీ, స్వప్న పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత స్వప్న వచ్చి మేం కలిసి ఉంటామని చెప్తుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్లి కాంచనకి చెప్తాడు. ఇప్పుడు మావయ్యకి ఏ టెన్షన్ లేదని దీప అంటుంది. అలాగే కార్తీక్ కి కూడా ఏ టెన్షన్ లేకుండా ఉండాలని అనుకుంటాను కదా అని కాంచన అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




