
కాకమ్మ కథలు సీజన్ 3 మొదటి ఎపిసోడ్ వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ కి చిన్నోడు పెద్దోడు అని పిలిచే డీమన్ పవన్, కళ్యాణ్ పడాల వచ్చారు. ఇక రాగానే వీళ్ళతో ఫస్ట్ రౌండ్ ఆడించింది. అందులో కొన్ని వర్డ్స్ ని పిక్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత కంటెస్టెంట్ కళ్ళు మూసుకుంటే హోస్ట్ కొన్ని పిక్స్ చూపిస్తుంది. అందులో ఒక్క పిక్ ని పక్క కంటెస్టెంట్ ఓకే చేస్తే ఆ పిక్ ని చూస్తూ ఆ వర్డ్స్ తో ఒక స్టోరీ అల్లాలి. అది కాన్సెప్ట్ . ఇక డీమన్ పవన్ కొన్ని వర్డ్స్ ని పిక్ చేసుకున్నాడు. "కం టు మై రూమ్. లైట్సాఫ్ , బ్యూటిఫుల్ , చిలిపి చేష్టలు బీచ్ " . ఇక కళ్యాణ్ రీతూ ఫోటో దగ్గర స్టాప్ చేయించాడు.
దాంతో డీమన్ పవన్ ఒక ఏ సర్టిఫికెట్ స్టోరీని ఆన్ ది స్పాట్ లో చెప్పుకొచ్చాడు. దానికి హోస్ట్ తేజస్వి మడివాడ ఫిదా ఐపోయింది. ఇంతకు ఆ స్టోరీ ఏంటో చూద్దాం. "సో నేను చిలిపిగా నా ఫ్రెండ్ ని భయపెడదామనుకున్నా. భయపెట్టాలంటే ముందు పొగడాలి కాదా. అందుకు నీ జుట్టు బ్యూటిఫుల్ . నీకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశా కం టు మై రూమ్ అని చెప్పా ఆ సర్ప్రైజ్ కోసం రూమ్ కి వచ్చింది. తాను వచ్చేసరికి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసా. తర్వాత ఒక్కసారిగా భయపడింది.
నేనేం చేయలేదు కరెక్ట్ పోయింది అనుకుంటే కరెంట్ రావట్లేదు. అప్పుడు చిలిపిగా నేనేం చేసానంటే కొన్ని టాయ్స్ ని అంటే స్నేక్, స్పైడర్ టాయ్స్ ని ఆమె మీదకు విసురుతున్న. ఆమె ఇంకా భయపడిపోతుంది. ఇంకా ఆపు నీ చిలిపి పనులు అంది. దాంతో నేను సరే పదా బీచ్ కి వెళ్దాం అని చెప్పా అలా హ్యాపీగా బీచ్ కి వెళ్లాం " అని స్టోరీ చెప్పాడు. "ఇన్ని సీజన్స్ కాకమ్మ కథల్లో ఇలా అల్లిన స్టోరీ ని నేను ఇప్పటివరకు వినలేదు. ఈ పదాలు వాడి యు సర్టిఫికెట్ సినిమా చెప్పావు చూడసలు గ్రేట్ " అంది తేజస్వి.




.webp)

